విశ్వం ఒక అంతు పట్టని అద్భుతం. అందులో అంతరిక్షం మహా అద్భుతం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పరీశోధనలు చేస్తున్నా అంతు పట్టని రహస్యాలు ఇంకా కోకొల్లలు. చాలా మందికి కలిగే డౌట్ ఏంటంటే….అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఓ ప్రత్యేకమైన డ్రెస్( స్పేస్ సూట్) ను ధరిస్తారెందుకు? అలా ఎందుకు ధరించాలి? ఆ డ్రెస్ లేకుండా అంతరిక్షంలోకి వెళితే ఏమవుతుంది?? వీటన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరిక్షంలోకి వెళ్లడం …అంటే భూ పరిధిని దాటి వెళ్లడం, అంటే అక్కడ భూమిమీది లాగా మనిషి బ్రతకడానికి వాతావరణం అనుకూలించదు. అందుకే వ్యోమగాములు ప్రత్యేక స్పేస్ సూట్ లను తొడుక్కొని వెళతారు. అంతరిక్షంలోని అతి చల్లధనం, అల్ప పీడనం, అత్యధిక రేడియేషన్ ప్రభావం లను తట్టుకోడానికి ఈ స్పేస్ సూట్ లు సహకరిస్తాయి.
స్పేష్ సూట్ లు ధరించకుంటే….అంతరిక్షంలో అధికంగా ఉండే భారరహిత స్థితిని అధిగమించడానికి శరీరం ఎక్కువ మొత్తంలో క్యాల్షియాన్నివిడుదల చేస్తుంది. దీని కారణంగా ఎముకలు అక్కడిక్కడే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలో పెద్ద సైజ్ లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.
అంతరిక్షంలో ఉండే భారరహిత స్థితి వల్ల హెల్మెట్ ఊడిపోయిన వెంటనే తల మరింతగా బరువెక్కుతుంది. రక్తప్రవాహం ఎక్కువగా శరీరం పైభాగంలోనే సాగుతుంది. దీంతో తల ఉబ్బడం మొదలయి.. ఒకానొక దశలో పేలిపోయే స్థితికి చేరుకుంటుంది. ఇదే సమయంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె అంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడంతో హార్ట్ కుచించుకుపోతుంది. దీంతో శ్వాస ఆగిపోయి మరణం సంభవిస్తుంది.
సాధారణంగా నాలుగు లేదా ఐదు నెలల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉంటారు.ఇంతకన్న ఎక్కువ రోజులు స్పేస్ లో ఉంటే…వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడున్నప్పుడు అర్థం కాదు కానీ…తిరిగి భూమి మీదికి వచ్చాక… ఎముకలు, కండరాలు బలహీనమవుతాయి.