Off Beat

పెద్ద పెద్ద మాల్స్‌లో సినిమా స్క్రీన్లు, ఫుడ్ కోర్టులను పై ఫ్లోర్లలోనే ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి తరుణంలో మాల్స్‌ ఎక్కువైపోయాయి&period; ఒకప్పుడు కేవలం మెట్రో సిటీలకే మాత్రమే ఈ మాల్స్‌ పరిమితం అయ్యాయి&period; కానీ ఇప్పుడు జనాలు నాగరికతకు బాగా అలవాటు పడ్డారు&period; పట్టణాలు&comma; గ్రామాల్లోనూ సిటీ పోకడలు వచ్చాయి&period; ఆయా ప్రాంతాలు కూడా నగరాలకు సమాంతరంగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి&period; దీంతో అవకాశాలకు కూడా కొదువ ఉండడం లేదు&period; ఈ క్రమంలోనే జనాభా కూడా అధికమవుతోంది&period; ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్‌ వ్యక్తులు&comma; యాజమాన్యాలు చిన్న చిన్న పట్టణాల్లోనూ మాల్స్‌ను నిర్మిస్తున్నారు&period; దీంతో జనాలకు ఏవి కావాలన్నా ఇప్పుడు మాల్స్‌లోనే దొరుకుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫుడ్‌ కోర్టులు&comma; సినిమా స్క్రీన్లు&comma; దుస్తులు&comma; కిరాణా సామాను&comma; ఎంటర్‌టైన్‌మెంట్&comma; బార్లు&comma; మొబైల్‌ షాపులు&period;&period; ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల షాపులను మాల్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు&period; అయితే ఎక్కడైనా మాల్స్‌లలో ఫుడ్ కోర్టులు&comma; సినిమా స్క్రీన్లు కేవలం టాప్‌ ఫ్లోర్‌లలోనే ఉంటాయి గమనించారు కదా&period; పై ఫ్లోర్‌కు వెళితే కానీ అవి మనకు కనబడవు&period; ఇక కింద మాత్రం అనేక షాపులుంటాయి&period; మరి ఇలా కేవలం పై ఫ్లోర్లలోనే ఫుడ్‌ కోర్టులు&comma; సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు గల కారణాలు ఏమిటో తెలుసా&period;&period;&quest; దీనికి సంబంధించిన రీజన్‌ ఒక్కటే&period;&period; అదేమిటంటే…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86295 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mall&period;jpg" alt&equals;"why screes and food courts setup in malls at high floors " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మాల్స్‌లో కింది ఫ్లోర్స్‌లలో రక రకాల షాపులుంటాయి&period; ఇక పై ఫ్లోర్‌లో స్క్రీన్లు&comma; దానికి కింద ఉన్న ఫ్లోర్‌లో ఫుడ్‌ కోర్టులు ఉంటాయి&period; అలా ఎందుకు ఏర్పాటు చేస్తారంటే&period;&period; వాటిని గనక ఒక వేళ కిందే పెడితే జనాలు ఎక్కువగా వచ్చేది వాటికే కనుక వాటికి వెళ్లి ఎంజాయ్‌ చేసి వెంటనే వెళ్లిపోతారు&period; అదే వాటిని పై ఫ్లోర్లో పెట్టారనుకోండి&period; జనాలు వాటిలో ఎంజాయ్‌ చేశాక&comma; కిందకు వెళ్లేటప్పుడు రక రకాల స్టోర్స్‌ను చూస్తారు&period; దీంతో వారికి ఏదైనా షాపులో ఏదైనా ప్రొడక్ట్‌ నచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది&period; దీంతో ఆయా షాపులకు బిజినెస్‌ కూడా వర్కవుట్‌ అవుతుంది&period; ఇది నిజానికి ఓ ట్రాప్‌ లాంటిదన్నమాట&period; మనలో సాధారణంగానే షాపింగ్‌ కుతూహలం ఉంటుంది కదా&period; అలాంటిది షాపుల్లో కళ్లకు ఆకట్టుకునే వస్తువులు కనిపిస్తే కొనుగోలు చేయకుండా ఉంటామా…&quest; కచ్చితంగా కొంటాం&period; కనుకనే మనల్ని ఆకట్టుకునేందుకు మాల్స్‌లో అలా కింది ఫ్లోర్స్‌లో వివిధ రకాల షాపులను ఏర్పాటు చేస్తారు&period; ఇదీ&period;&period; అసలు రహస్యం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts