Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపే ఎందుకు తిరుగుతుందో తెలుసా?

Admin by Admin
April 5, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీకు పొద్దుతిరుగుడు మొక్కల గురించి తెలుసా.? పోనీ పొద్దుతిరుగుడు పువ్వులైనా తెలుసా..? ఆ.. తెలిసే ఉంటుందిలెండి. ఈ పువ్వుకు ఒక లక్షణం ఉంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. అందుకే వీటిని పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. అలాగే వీటిని సూర్యకాంత పుష్పాలు అని కూడా పిలుస్తారు. అయితే అవి సూర్యుని వైపుగా ఎందుకు తిరుగుతాయి అనే ప్రశ్నకు సమాధానంగా గ్రీకులో ఒక కథ బాగా ప్రచుర్యంలో ఉంది, దానితో పాటు సన్ ప్లవర్ , సన్ ఉన్న వైపుకే ఎందుకు తిరుగుతుందో సైన్స్ కూడా చెప్పింది. ఆ రెండింటి గురించి తెలుసుకుందాం.

గ్రీకు కథ అధారంగా : గ్రీకులు సూర్యుడిని అపోలోగా పిలుస్తారు. సూర్యుడి అందానికి కైట్లీ అనే వనదేవత అతడిని అమితంగా ప్రేమించిందట. ఆ విషయాన్ని తెలుపగా సూర్యుడు తిరస్కరించాడు. కారణం సూర్యుడు జలదేవుని కుమార్తె అయిన డఫ్నేను ప్రేమించాడు.తన ప్రేమ సంగతి డఫ్నేకు చెబితే ఆమె తిరస్కరించింది. పదేపదే తన ప్రేమ విషయమై సూర్యుడు ఒత్తిడిచేయడంతో డఫ్నే, తన తండ్రి జలదేవుని ముందు మొరపెట్టుకోగా, జలదేవుడు తన కూతుర్ని మొక్కగా చేశాడు. దీంతో సూర్యుడు మనసు బాధపడింది. అయితే సూర్యుడినే ప్రేమిస్తున్న కైట్లీ, సూర్యుడి కోసం 9 రోజులపాటు అన్న పానీయాలు పక్కనపెట్టి, అక్కడే ఉంటూ సూర్యుడు వచ్చి వెళ్ళేంతవరకూ చూస్తూ ఉండేదట. అలా కైట్లీ పువ్వుగా మారిపోయింది. పువ్వుగా మారిన కైట్లీ ప్రతిరోజు తాను ప్రేమించిన సూర్యుడిని చూస్తూ ఉంటుందట…అందుకే ఆ పువ్వునే మనం సన్ ఫ్లవర్ అని పిలుస్తున్నాం.

why sun flowers always turn to sun

సైన్స్ ఆధారంగా: పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు వైపు తిరగడానికి కారణం ఆ మొక్కలలో ఉండే ఫోటోట్రాఫిజమ్. సాధారణంగా మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి అవసరం. దాని కారణంగా మొక్కల పెరుగుదల జరుగుతుంది. మొక్కల పెరుగుదలతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించే చర్యను ఫోటోట్రాఫిజమ్ అంటారు. సన్ ఫ్లవర్ మొక్కలో ఉన్న అమినో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆక్సిన్ హార్మోన్ కారణంగా పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది. సూర్యరశ్మి పడనిభాగంలో ఆక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పువ్వు ఎప్పుడైతే సూర్యుడి వైపు తిరుగుతుందో దాని వెనుక భాగంలో ఆక్సిన్ ఉత్పత్తి అవుతుంది. దానివలన ఆ భాగం త్వరగా పెరిగి, పువ్వు కదులుతుంది. నీడ ఉన్నవైపు పువ్వు వెనుక భాగం కదిలితే, పువ్వు ముందుభాగం సూర్యుడి వైపుకు కదులుతుంది. ఈ కారణంగానే పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుడి పొద్దు వైపుకు తిరుగుతూ అభిముఖంగా ఉంటుంది.

Tags: sunsun flowers
Previous Post

పెళ్లిసమయంలో పెళ్లికూతురు చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా?

Next Post

ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఏర్పాటు చేస్తున్న యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు అంటే ఏమిటో మీకు తెలుసా..?

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!