ఒక వృద్ధుడికి స్తన్యం ఇస్తున్న మహిళ పెయింటింగ్ 30 మిలియన్ల యూరోలకు అమ్ముడు పోయింది. అప్పట్లో ఈ పెయింటింగ్ ఎంతో మందిని ఆలోచింపజేసింది. ఈ పెయింటింగ్ వెనుక ఉన్న కథను చరిత్ర పుటల్లోంచి తొలగించారు. పెయింటింగ్‌ను చూస్తే అపార్థం చేసుకునే వారే ఎక్కువ. కనుక ఈ పెయింటింగ్ కథను తొలగించారనే ప్రచారం ఉంది. అయితే ఇంతకీ దీని వెనుక ఉన్న కథేమిటి..? అంటే..
ఫ్రాన్స్‌లో 14వ లూయీస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందీ సంఘటన. ఒక వృద్ధుడు బ్రెడ్‌ను దొంగిలించాడనే నెపంతో అతన్ని కారాగారంలో బంధిస్తారు. దొంగతనం చేసిన వారికి కూడా అప్పట్లో ఆ ప్రాంతంలో మరణ శిక్షలను విధించేవారు. ఆ వృద్ధుడికి కూడా అలాంటి శిక్షనే విధించారు. అతనికి చనిపోయే వరకు ఆహారం పెట్టకూడదని, చనిపోయే వరకు కారాగారంలోనే ఉంచాలని శిక్ష విధించారు. ఈ క్రమంలో ఆ వృద్ధుడి కుమార్తె రోజూ అతన్ని చూసేందుకు కారాగానికి వచ్చేది. ఆమె ఒక బాలింత.
ఆ మహిళను తన తండ్రిని చూసేందకు అనుమతిచ్చేవారు. అలా ఆమె తన తండ్రిని చూసేందుకు వచ్చినట్లుగా వచ్చి ఎవరూ చూడని సమయంలో తన పాలను తన తండ్రికి తాగించేది. అలా 4 నెలలు గడుస్తాయి. ఆశ్చర్యం, ఆ వృద్ధుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆహారం అందకపోతే ఈపాటికే చనిపోయి ఉండాల్సింది అని అంతా భావించారు. కానీ అన్ని రోజులు అయినా ఆ వృద్ధుడు చనిపోలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాజు ఆదేశించాడు. ఈసారి ఆ మహిళ వచ్చినప్పుడు ఆమెపై కన్నేసి ఉంచారు. విషయం అర్థమైంది. రాజుకు అంతా తెలిసిపోయింది. తన తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలని ఆ మహిళ పడుతున్న తపనను చూసి రాజు చలించిపోయాడు. ఆ వృద్ధుడికి వేసిన శిక్షను వెంటనే రద్దు చేసి అతన్ని విడుదల చేశారు. ఇదీ.. ఆ పెయింటింగ్ వెనుక ఉన్న కథ. మహిళలు ఒక వ్యక్తిని ప్రేమించినా, ఆరాధించినా వారికి ఉండే అంకిత భావానికి నిదర్శనమే ఈ కథ. ఇది అందరినీ ఆలోచింపజేస్తోంది.