Off Beat

నా వ‌య‌స్సు 41.. భ‌ర్త వ‌దిలేశాడు.. ఈ వ‌య‌స్సులో తోడు కావాల‌నిపిస్తుంది.. ఎలా..?

నా వయసు 41. నాకు ముగ్గురు పిల్లలు. నా భర్త వదిలేశాడు. పిల్లల్ని పెద్ద చేశాను.చాలా కష్టపడ్డాను. నేను ఒంటరి తనం భరించలేక పోతున్నాను… ఈ వయసులో తోడు కావాలి అనిపిస్తుంది… మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తుంది… ఇది… తప్పా… నేను ఎంచెయ్యాలి…?

భర్త వది లేశాడు అంటున్నావ్‌… ఎంతో కష్ట పడ్డావు పిల్లల్ని పెంచావ్… ఇప్పుడు నీ పిల్లల వయసు 15 నుంచి 20 సంవత్సరాలు ఉండవచ్చు. వారింక వివాహాలు చేసుకొని settle అయి ఉండక పోవచ్చు… ఒంటరి తనం…. అది ఒక మానసిక భావన. పది మందిలో ఉండి కూడా ఒంట‌రిగా feel అవుతారు…. ఏదో ఒక వృత్తి సేవ వ్యాపారం చేయండి. పది మందితో సామాజిక సంబంధాలను నెరపండి. మీ ఖాళీ సమయంలో మీ కిష్టమయిన పనులను అల్లికలు, కుట్టు మిషన్, embroidery చేయండి. తోడు కావాలని ఉంది… అంటున్నారు.. నీ పిల్లలకు తోడుగా ఉండడం ఎంచుకో… వారితొ గాని వారిలో ఏ ఒకరితో గాని కలసి బ్రతుకు… వారి తో మానసిక తోడును ఏర్పరచుకో….

woman raised kids without husband wants help

మీలో శృంగార వాంఛలు ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని మీరు త్పప్తి పరచు కొనే సెల్ఫ్ సెక్స్ మార్గాలను ఎంచుకొండి… అలా కొంత కాలం … మీ వయసు అయిపోతుంది. మీ పిల్లల మరియు నీ కుటుంబ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా…. పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది….. అంటున్నారు.. నీ జీవితం నీ యిష్టం… పిల్లలు పెళ్ళాం లేని మీకు తెలిసిన మంచి వ్యక్తి ఎవరయినా ఉండి… మీకు మీ పిల్లలకు రక్షణ సంరక్షణ కలిగిస్తాడని మీరు భావిస్తే…. ఈ వయసులో మీరు అతనితో సర్ధుకు పోగలనని భావిస్తే… మీ పిల్లలను వదిలి ఉండగల నని భావిస్తే… పిల్లలతొ చర్చించి పెళ్ళి నిర్ణయం తీసుకొండి…

Admin

Recent Posts