Akkalakarra : మన చుట్టూ అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ అవి మనకు మేలు చేస్తాయని తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కల్లో అక్కల కర్ర మొక్క కూడా ఒకటి. ఇది బంగారమంత విలువైన మొక్క. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అక్కల కర్ర మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్కల కర్ర మొక్కను ఉపయోగించి మన శరీరంలో ప్రతి అవయవానికి వచ్చే అనారోగ్య సమస్యను నయం చేసుకోవచ్చు. అక్కల కర్రను సంస్కృతంలో అకల కరబా అని హిందీలో అకర్ కరా అని ఇంగ్లీష్ లో పిలిటోరీ రూట్ అని పిలుస్తారు. అక్కల కర్ర మొక్కలో అనేక రకాల జాతులు ఉంటాయి.
పసుపు రంగు పూలు పూసే అక్కలకర్ర మొక్కలు మన రాష్ట్రంలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ అక్కల కర్ర మొక్కలో అన్నింటి కంటే ముఖ్యమైనది ఈ మొక్క వేరు. ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ మొక్క వేర్లు మనకు లభిస్తాయి. పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క వేరు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అక్కల కర్ర మొక్క వేరు కారం రుచిని కలిగి ఉంటుంది. శరీరంలోని వాత, కఫ, పిత దోషాలను తొలగించడంలో ఈ వేరు మనకు దోహదపడుతుంది. అలాగే ఈ మొక్క మన శరీరంలో నరాలకు బలాన్ని కలిగించి గుండె జబ్బులను, పక్షవాతాన్ని, తలనొప్పిని, మూర్ఛ వ్యాధులను నయం చేస్తుంది. అక్కల కర్ర వేరును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిని రెండు చిటికెల మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి చప్పరిస్తూ తినాలి. ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్క వేరును నీటితో అరగదీయగా వచ్చిన గంధాన్ని గోధుమ గింజంత పరిమాణంలో తీసుకుని నాలుక మీద రాసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నత్తి సమస్య తగ్గుతుంది. అక్కల కర్రను, శొంఠిని, దుంప రాష్ట్రాన్నివీటిని ఒక్కోటి ఒక్కో గ్రాము మోతాదులో తీసుకోవాలి. వీటిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక్కో కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి.
తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే గొంతులో పోసుకుని 5 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా చేయడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు, దంతాల సమస్యలన్ని తగ్గు ముఖం పడతాయి. అక్కల కర్ర వేరును, మిరియాలను, శొంఠిని ఒక్కోటి ఐదు గ్రాముల మోతాదులో తీసుకుని మెత్తగా నూరి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నుదుటికి లేపనంగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి తలనొప్పైనా తగ్గుతుంది. ఈ అక్కల కర్ర వేరు పొడిని, శొంఠి పొడిని, నల్ల జీలకర్ర పొడిని, సన్న రాష్ట్రం పొడిని సమానంగా కలిపి నిల్వ ఉంచుకోవాలి. ప్రతిరోజూ రెండు పూటలా ఈ పొడిని రెండు గ్రాముల మోతాదులో తీసుకుని తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల పక్షవాతం క్రమంగా తగ్గుతుంది. ఈ మొక్క వేరు పొడిని రెండు లేదా మూడు చిటికెల మోతాదులో తీసుకుని తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈవిధంగా అక్కల కర్ర మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.