Avisa : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ చాలా వరకు మొక్కల గురించి మనకు తెలియదు. ఆయుర్వేదంలో అనేక రకాల మొక్కలను ఔషధాలుగా ఉపయోగిస్తారు. అలాంటి మొక్కలు మన చుట్టూ పరిసరాల్లో ఉంటున్న సంగతి మనకు తెలియదు. ఇక అలాంటి మొక్కల్లో అవిశ మొక్క కూడా ఒకటి. ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజలకు కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అవిశ మొక్కలకు చెందిన పువ్వులు, ఆకుల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, ఫోలేట్, థయామిన్, నియాసిన్, విటమిన్ సి లు లభిస్తాయి. అలాగే పువ్వుల్లో మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ ఉంటాయి. ఈ మొక్క ఆకులను అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో వీటిని ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఈ మొక్క ఆకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో డీఎన్ఏ సురక్షితంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఈ మొక్క ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కనుక బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మొక్క ఆకులను రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. ఈ మొక్క ఆకుల్లో ఉండే కాల్షియం, ఐరన్ ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీంతో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అవిశ మొక్క ఆకులు, పువ్వులు చేదుగా ఉంటాయి. అందువల్ల అందరూ తినలేరు. కానీ ఆకులకు ఉండే కాడలను తీసేస్తే కాస్త చేదు తగ్గుతుంది. దీంతో వీటిని తినవచ్చు. వీటిని తేనె లేదా కొబ్బరితో కలిపి తినాలి. దీంతో చేదు తగ్గుతుంది. అయితే ఈ మొక్క ఆకులను అధికంగా తినరాదు. తింటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక మోతాదులోనే తీసుకోవాలి. ఇలా అవిశ మొక్కతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఇది కనబడితే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.