Custard Apple Leaves : చక్కటి రుచితో పాటు పోషకాలను కూడా కలిగే ఉండే ఫలం సీతాఫలం. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. సీతాఫలం మనకు కాలానుగుణంగా లభిస్తుంది. సీతాఫలంలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి, రైబోప్లేవిన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. సీతాపలాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం సీతాఫలాలే కాదు సీతాఫలం చెట్టు ఆకులు, గింజలు, వేరు, బెరడు కూడా మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. సీతాఫలంలో చెట్టులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీతాఫలాలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరానికి చలువ చేస్తుంది.
ఈ ఫలాన్ని తినడం వల్ల శరీరంలో ఉండే కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణశకర్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సీతాఫలం ఏవిధంగా అయితే మన శరీరానికి మేలు చేస్తుందో సీతాఫలం చెట్టు ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. సీతాఫలం చెట్టు ఆకుల్లో హైడ్రోస్థెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలను చాలా త్వరగా తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులకు పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మం పై లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర, దరదలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల గాయాలు, పుండ్లు కూడా తగ్గుతాయి. సెగ గడ్డలతో బాధపడే వారు సీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా నూరి గడ్డలపై ఉంచి కట్టుకట్టాలి.
ఇలా చేస్తూ ఉండడం వల్ల సెగ గడ్డల సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమల సమస్యతో బాధపడుతన్నారు. అలాంటి వారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి అవాంఛిత రోమాలపై రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల అవాంఛిత రోమాల సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు. సీతాఫలం చెట్టు ఆకులతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అలాగే ఈ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల డయేరియా సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. సీతాఫలం చెట్టు ఆకులను పేస్ట్ గా చేసి దానికి బోరిక్ పౌడర్ ను కలిపి మంచాలు, కుర్చీల దగ్గర మూలల్లో ఉంచాలి.
ఇలా చేయడం వల్ల దోమల బెడద, నల్లుల బెడద తగ్గుతుంది. సీతాఫలం గింజలను పొడిగా చేసి తలకు రాసుకోవడం వల్ల పేల సమస్య తగ్గుతుంది. అయితే ఈ పొడిని ఉపయోగించేటప్పుడు కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. ఈ చెట్టు ఆకులను, ఉమ్మెత ఆకులను సమానంగా తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పేను కొరుకుడు సమస్య ఉన్న చోట రాసి మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా 8 రోజుల పాటు చేయడం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గడంతో పాటు ఆ భాగంలో తిరిగి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. ఈ విధంగా సీతాఫలం చెట్టు ఆకులు, బెరడు, గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.