Erra Ganneru : మనం పెరట్లో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే పూల మొక్కలలో గన్నేరు చెట్టు ఒకటి. గన్నేరు చెట్లు ఒకే జాతికి చెందినప్పటికి వీటి పూలు పింక్, తెలుపు, పసుపు వంటి రంగుల్లో మనకు లభిస్తుంటాయి. ఇవి ఎక్కువగా రహదారుల మధ్యలో, రహదారులకు ఇరు వైపులా కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్ల పూలతో శివున్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈ చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఔషధ గుణాలను కలిగినప్పటికీ ఈ చెట్టు ఎంతో విషపూరిమైనది. బాహ్య శరీరానికి వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి మాత్రమే ఈ చెట్టు ఉపయోగపడుతుంది.
ఈ చెట్టులో ప్రతి భాగం ఎంతో విషపూరితమైనది. ఈ చెట్టు కాయలను కానీ, ఆకులను కానీ తింటే అది మనిషి ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. జంతువులకు కూడా ఈ చెట్టు విషపూరితమైనదే. చర్మ సంబంధమైన సమస్యలను తగ్గించుకోవడానికి ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. గన్నేరు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని మోకాళ్ల నొప్పులు ఉన్న చోట రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. తెలియక ఈ చెట్టు ఆకులను, కాయలను ఎవరైనా తినప్పుడు ఒక టీ స్పూన్ ఆవు పాలలో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ పటిక బెల్లాన్ని కలిపి తాగించాలి. ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం విషానికి విరుగుడుగా పని చేసి ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. అంతే కాకుండా ఆవు పేడను గ్లాసు నీటిలో వేసి కలిపి ఆ నీటిని వడకట్టి తాగించవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా ప్రాణాలను కాపాడవచ్చు.
బొల్లి మచ్చలు ఉన్న వారు గన్నేరు చెట్టు లేత ఆకులను తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరి బొల్లి మచ్చలపై ప్రతి రోజూ రాయడం వల్ల బొల్లి మచ్చలు తగ్గుతాయి. గన్నేరు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఇంట్లోకి క్రిములు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే క్రిములు కూడా నశిస్తాయి.
గన్నేరు చెట్టు వేరును గంధంతో కలిని నూరి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాయడం వల్ల కుష్టు, తామర, గజ్జి, పుండ్లు, సోరియాసిస్ వంటివి త్వరగా తగ్గుతాయి. గన్నేరు చెట్టు పూలను నీటితో కలిపి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాయడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. గన్నేరు ఆకుల కషాయాన్ని కళ్లలో పడకుండా తలకు రాయడం వల్ల తలలో ఉండే పుండ్లు తగ్గడమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ చెట్టు విషపూరితమైనది కనుక దీనిని పెద్దలు లేదా ఆయుర్వేద నిపుణుల సమక్షంలో మాత్రమే ఉపయోగించాలి. లేదంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.