Cardamom : ఎంతో ఖ‌రీదు ఉండే యాల‌కులు.. వీటిని ఇంట్లోనే ఇలా సుల‌భంగా పండించండి..!

Cardamom : మ‌నం ఇంట్లో ఎక్కువ‌గా కూర‌గాయ‌లు, పండ్లు, పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఎటువంటి ర‌సాయ‌నాల‌ను వాడ‌కుండా సహ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో పండించుకున్న కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇలా కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను పండించుకుని తిన‌డం వ‌ల్ల ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంది. ఇక మ‌నం వంట‌ల్లో మ‌సాలా దినుసులను కూడా వాడుతూ ఉంటాం. అయితే ఈ మ‌సాలా దినుసుల మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లో పెంచుకోలేము అని అంద‌రూ అనుకుంటారు. కానీ మ‌సాలా దినుసుల‌లో ఒక‌టి అయిన‌ యాలకులను మ‌నం ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. ఇంట్లో యాల‌కుల మొక్క‌ల‌ను ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

grow Cardamom at your home in these simple steps
Cardamom

ముందుగా యాల‌కుల‌ను తీసుకుని వాటి నుండి గింజ‌ల‌ను తీసి 12 గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టుకోవాలి. గింజ‌లు నానిన త‌రువాత త‌డి లేకుండా తుడిచి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు మ‌నం సాధార‌ణంగా ఇంట్లో మొక్క‌ల‌ను పెంచ‌డానికి వాడే మ‌ట్టిని, ఇసుక‌ను స‌మ‌పాళ‌ల్లో తీసుకుని కుండీలో కానీ, ప్లాస్టిక్ డ‌బ్బాలో కానీ వేసుకోవాలి. ప్లాస్టిక్ డ‌బ్బాను వాడే వారు డ‌బ్బా అడుగు భాగంలో రంధ్రాలు చేసుకోవాలి. కుండీలో లేదా డ‌బ్బాలో వేసుకున్న మ‌ట్టిలో త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మ‌ట్టిని త‌డి గా చేసుకోవాలి. ఇప్పుడు ప‌క్క‌కు పెట్టుకున్న‌ యాల‌కుల గింజ‌ల‌ను తీసి మ‌ట్టి పై చ‌ల్లుకోవాలి.

ఇలా చ‌ల్లిన గింజ‌ల‌పై మ‌ళ్లీ మ‌ట్టిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న మ‌ట్టిపై కొద్దిగా నీటిని చ‌ల్లి కొద్దిగా ఎండ త‌గిలే ప్ర‌దేశంలో ఉంచాలి. మ‌ట్టి త‌డి ఆరిపోయిన‌ప్పుడ‌ల్లా నీటిని చ‌ల్లుకుంటూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల యాల‌కుల మొల‌కలు వ‌స్తాయి. త‌రువాత మొక్క‌లు పెరుగుతాయి. ఇలా మ‌నం యాల‌కుల మొక్క‌ల‌ను ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు.

యాల‌కుల మొక్క‌ల‌కు ఉన్న వేరు వ్య‌వ‌స్థ వ‌ల్ల అవి ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతాయి. యాల‌కుల‌ను వంట‌ల్లో వాడ‌డం వల్ల వంట రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

D

Recent Posts