పుదీనా ఆకుల‌తో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా నయం చేసుకోవ‌చ్చు..!

పుదీనాను చాలా మంది ఇండ్ల‌లో పెంచుతుంటారు. ఈ మొక్క ఆకుల‌ను కూర‌ల్లో వేస్తుంటారు. మ‌జ్జిగ‌తో త‌యారు చేసే రైతాలోనూ పుదీనాను వాడుతారు. పుదీనాతో చాలా మంది చ‌ట్నీ చేసుకుని తింటారు. అయితే నిజానికి పుదీనాలో అనేక ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. పుదీనాను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of mint leaves in telugu

1. జీర్ణ ప్ర‌క్రియ

అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే మొక్క‌ల్లో ఒక‌టిగా పుదీనా ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డింది. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అజీర్ణ స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఐదారు పుదీనా ఆకుల‌ను కోసి అలాగే తినాలి. లేదా వాటి ర‌సం అయినా సేవించ‌వ‌చ్చు. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా క‌డుపులో మంట‌, గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. ఆయా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధంగా పుదీనా ఆకులు ప‌నిచేస్తాయి. అందుక‌నే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

2. ఆస్త‌మా

పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ్వాస కోశ స‌మ‌స్య‌లను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా ఆస్త‌మా ఉన్న‌వారు ఈ ఆకుల‌ను నిత్యం తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.

3. ద‌గ్గు, జ‌లుబు

ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డేవారు పుదీనా ఆకుల‌ను తీసుకుంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పుదీనా ఆకుల ర‌సాన్ని సేవించినా చాలు. ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. లేదా పుదీనా ఆకుల‌తో త‌యారు చేసే టీ కూడా తాగ‌వ‌చ్చు. దీంతో శ్వాస‌నాళాలు క్లియ‌ర్ అయి గాలిని బాగా పీల్చుకునేందుకు సౌక‌ర్యం ఏర్ప‌డుతుంది.

4. త‌ల‌నొప్పి

బాగా త‌ల‌నొప్పి ఉన్న‌వారు కొన్ని పుదీనా ఆకుల‌ను తింటే త‌క్ష‌ణ‌మే ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. నోరు, దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు

పుదీనా ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. చిగుళ్ల వాపు త‌గ్గుతుంది. నిత్యం ఈ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. అధిక బ‌రువు

పుదీనా ఆకుల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు.

7. మెద‌డు ప‌నితీరు

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలన్నా, చురుగ్గా ప‌నిచేయాల‌న్నా, ఏకాగ్ర‌త పెర‌గాల‌న్నా నిత్యం కొన్ని పుదీనా ఆకుల‌ను తినాలి. ఈ విష‌యం సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

8. చర్మ సంర‌క్ష‌ణ

మొటిమ‌ల‌ను త‌గ్గించేందుకు పుదీనా ఆకులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. మొటిమ‌ల‌ను త‌గ్గిస్తాయి. పుదీనా ఆకుల్లో ఉండే సాలిసిలిక్ యాసిడ్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం మొటిమ‌లను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. నిత్యం పుదీనా ఆకుల ర‌సాన్ని తేనెతో క‌లిపి ముఖానికి రాసుకుని 60 నిమిషాల పాటు ఆగి త‌రువాత క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉండ‌వు.

9. వికారం

వాంతులు అవుతున్న వారు, వికారం స‌మ‌స్య ఉన్న‌వారు పుదీనా ఆకుల‌ను తింటే త‌క్ష‌ణ‌మే ఈ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

10. ఒత్తిడి, ఆందోళ‌న

నిత్యం పుదీనా ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

Share
Admin

Recent Posts