మన చుట్టూ అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద పరంగా ఉపయోగపడే మొక్కలు కొన్ని ఉంటాయి. కానీ వాటిని గమనించం. అవి మన పరిసరాల్లోనే పెరుగుతాయని తెలిసి ఆశ్చర్యపోతుంటాం. అలాంటి మొక్కల్లో రణపాల మొక్క ఒకటి. దీన్ని ఆఫీసుల వద్ద, ఇంటి పరిసరాల్లో అలంకరణ మొక్కగా పెంచుతారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ మొక్క వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రణపాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. ఈ జాతిలో సుమారుగా 40 వరకు మొక్కలున్నాయి. ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకులను నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు.
1. రణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్‌లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి.
2. రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది.
3. రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
4. రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు.
5. జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
6. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి.
7. ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గుతుందది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది.
8. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి.
9. కామెర్లు ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి నయం అవుతుంది.
10. రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
11. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి నుదుటిపై పట్టీలా వేయాలి. తలనొప్పి తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365