Kasthuri Benda : మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లలో ఔషధ గుణాలు కలిగిన చెట్లతోపాటు దివ్య శక్తులు కలిగిన చెట్లు కూడా ఉన్నాయి. అలాంటి చెట్లలో కస్తూరి బెండ చెట్టు కూడా ఒకటి. చేల దగ్గర, పొలాల గట్ల మీద ఈ చెట్లు మనకు ఎక్కువగా కనబడతాయి. ఈ చెట్టును దైవీక పనులకు ఉపయోగిస్తారని, అంతేకాక ఈ చెట్టును ఔషధంగా కూడా ఉపయోగిస్తారని మనలో చాలా మందికి తెలియదు. ఈ చెట్టు పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఈ చెట్టుకు కాసే బెండకాయలు చాలా చిన్నగా ఉంటాయి. ఈ బెండకాయల్లో ఉండే గింజలతో మనం అద్భుతమైన తిలకాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ చెట్ల గింజలతో తిలకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా 30 బెండ గింజలను సేకరించాలి. ఈ గింజలను ఎప్పుడు పడితే అప్పుడు సేకరించకూడదు. ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే ఆ చెట్టుకు దగ్గరికి వెళ్లి నమస్కరించి మనం ఎందుకు ఆ గింజలను సేకరిస్తూన్నామో ఆ చెట్టుకు చెప్పి ఆ తరువాత ఎండిన బెండకాయలను సేకరించి వాటి నుండి గింజలను తీసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత గంధపు చెక్కను తీసుకుని దానిని రంగరించగా వచ్చిన గంధంలో ఈ గింజల పొడిని కలిపితే అది చక్కని తిలకంగా తయారవుతుంది. దీనిని క్రమం తప్పకుండా ప్రతిరోజూ బొట్టులా ధరించాలి. ఇలా చేయడం వల్ల మనం ఎవరిలో అయితే మాట్లాడుతామో వారు మన వైపు ఆకర్షించబడతారు.

కస్తూరి బెండ గింజలతో చేసిన తిలకాన్ని బొట్టులా పెట్టుకోవడం వల్ల ఇతరులు మన వైపు ఆకర్షణకు గురి అవడం వల్ల వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. భార్యా భర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శారీరక రుగ్మతలను నయం చేయడంలో కూడా ఈ తిలకం ఉపయోగపడుతుంది. చర్మంపై దురదలు వచ్చినప్పుడు ఈ తిలకాన్ని ఆ దురదలు ఉన్న చోట చర్మం పై రాయడం వల్ల దురదలు తగ్గుతాయి. బయట ఆయుర్వేద షాపులల్లో కూడా మనకు ఈ గింజలు లభిస్తాయి. కానీ వాటిని ఉపయోగించకూడదు. ఈ విధంగా కస్తూరి బెండ గింజలతో చేసిన తిలకాన్ని ధరించడం వల్ల ఇతరులు మనపై చిరాకు పడకుండా మన పట్ల ఆకర్షితులు అవుతారని పండితులు చెబుతున్నారు.