Insulin Plant : ఈ మొక్క ఇంట్లో ఉంటే.. షుగ‌ర్ ఎవ‌రికీ ఉండ‌దు..!

Insulin Plant : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. మ‌న దేశంలో చాలా మంది మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. అయితే షుగ‌ర్ త‌గ్గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇక వీటితోపాటు ఇన్సులిన్ మొక్క అని పిల‌వ‌బ‌డే ఈ మొక్క‌కు చెందిన ఆకుల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను గ‌ణ‌నీయంగా అదుపు చేయ‌వ‌చ్చు. మ‌రి ఆ మొక్క విశేషాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

keep Insulin Plant in your home and get rid of diabetes
Insulin Plant

ఇన్సులిన్ ప్లాంట్‌నే Costus Igneus అని కూడా పిలుస్తారు. ఇది దాని శాస్త్రీయ నామం. అలాగే దీన్ని క్రీప్ జింజ‌ర్‌, కెముక్‌, క్వె, కికండ్‌, కుముల్ అని వివిధ ర‌కాల‌ పేర్ల‌తోనూ పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ మొక్క‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ఇక ఈ మొక్క స‌హాయంతో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్సులిన్ మొక్క నుంచి రెండు ఆకుల‌ను తీసి క‌డిగి శుభ్రం చేయాలి. అనంత‌రం ఆ ఆకుల‌ను దంచి పేస్ట్‌లా చేయాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ముందు సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను వేసి బాగ క‌ల‌పాలి. ఆ పేస్ట్ బాగా క‌రిగే వ‌ర‌కు తిప్పాలి. అనంతరం ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగాలి. త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తీసుకోకూడ‌దు. ఇలా రోజూ ఈ ఆకుల‌ను తీసుకుంటుంటే దెబ్బ‌కు షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. ఒక నెల రోజుల పాటు వాడి చూస్తే త‌ప్పక ఫ‌లితం క‌నిపిస్తుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఇక ఈ విధంగా ఇన్సులిన్ మొక్క ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం షుగ‌ర్ త‌గ్గ‌డ‌మే కాకుండా.. ప‌లు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. దీని వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్లు, కంటి ఇన్‌ఫెక్ష‌న్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్త‌మా, మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు, విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు. ఇక ఈ మొక్క‌ను ఇంట్లోనూ పెంచుకోవ‌చ్చు. దీంతో రోజూ తాజా ఆకుల‌ను తెంపి ఉప‌యోగించ‌వ‌చ్చు.

Admin

Recent Posts