Marla Matangi : మన చుట్టూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలల్లో మరుల మాతాంగి చెట్టు కూడా ఒకటి. ఇది ఎక్కువగా గ్రామాల్లో, రోడ్ల వెంబడి, కాలువ గట్ల మీద, బీడు భూముల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు గరుకుగా, మందంగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా ఒకే దగ్గర గుంపుగా పెరుగుతాయి. అలాగే ఈ చెట్టు కాయలు ముండ్లను కలిగి ఉంటాయి. ఈ కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ చెట్టు కాయలు కాస్తాయి. చాలా మంది ఈ చెట్టును ఒక పిచ్చి చెట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ దీనిని ఔషధంగా ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. మరుల మాతాంగి చెట్టు ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చెట్టు గింజల నుండి నూనెను కూడా తయారు చేస్తారు. ఈ నూనెను వాడడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా క్యాన్సర్, క్షయా, మలేరియా, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. పూర్వకాలంలో వశీకరణ మందుల తయారీలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగించే వారు. మరుల మాతాంగి చెట్టు ఆకులను సేకరించి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను పుండ్లు, గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అలాగే ఈ ఆకుల పేస్ట్ ను నొప్పులు ఉన్న చోట రాసి కట్టు కట్టాలి. అలాగే ఈ ఆకుల రసాన్ని తీసి ఒళ్లంతా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు ఆకులను ఉపయోగించి మనం ఇంట్లో ఉండే దోమలను నివారించుకోవచ్చు. ఈ చెట్టు ఆకులను కాల్చగా వచ్చిన పొగ కారణంగా దోమలు పారిపోతాయి.
ఇంట్లో ఈ చెట్టు ఆకులతో పొగ వేయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది. అలాగే పూర్వకాలంలో మరుల మాతాంగి చెట్టుతో మందులు తయారు చేసి పశువులకు ఆహారంలో ఇచ్చేవారు. దీంతో పశువుల ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఇంటికి వచ్చేవట. ఈ విధంగా మరుల మాతాంగి చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయినప్పటికి దీనిని బాహ్యంగానే ఉపయోగించాలని అదే విధంగా నిపుణుల సమక్షంలోనే ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.