Menthikura Leaves : రోజూ మీరు తినే ప్లేట్‌లో ఈ ఆకులు కొన్ని పెట్టుకోండి చాలు.. కోట్లు ఇచ్చినా రాని ఆరోగ్యం వ‌స్తుంది..!

Menthikura Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో మెంతికూర కూడా ఒక‌టి. మెంతికూర కొద్దిగా చేదుగా ఉంటుంది. దీంతో చాలా మంది దీనిని తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతికూర‌ను వారానికి రెండు సార్లు వీలైతే ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మెంతికూర‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. 100గ్రాముల మెంతికూర‌లో 86.5 గ్రాముల నీటిశాతం ఉంటుంది. అలాగే 34 కిలో క్యాల‌రీల శ‌క్తి, 2 గ్రాముల పిండి ప‌దార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్, 0.8 గ్రాముల ఫ్యాట్, 5 గ్రాముల పీచు ప‌దార్థాలు ఉంటాయి.

అదే విధంగా 5.6 మిల్లీ గ్రాముల ఐర‌న్, 396 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 58 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి, 75 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్, 428 మైక్రో గ్రాముల విట‌మిన్ కె, 9,245 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్, 63.6 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇత‌ర ఆకుకూర‌ల కంటే మెంతికూర‌లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌కత త‌గ్గుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పురుషులు త‌ర‌చూ మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతాయి. ఎదిగే పిల్ల‌లు, మోనోపాజ్ ద‌శ‌లో ఉన్న స్త్రీలు, ఆస్ట్రియోపోరోసిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Menthikura Leaves benefits in telugu take them daily
Menthikura Leaves

మెంతికూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటిచూపు మెరుగుప‌డుతుంది. బాలింత‌లు ఈ మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది. నోటిపూత, నోటిలో అల్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మెంతికూర‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ మెంతికూర‌తో మ‌నం ప‌ప్పు, ప‌రోటా, ట‌మాట మెంతికూర ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో మెంతికూర‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts