Mint Leaves : పుదీనా.. ఇది మనందరికి తెలిసిందే. వంటలను గార్నిష్ చేయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పుదీనాతో పచ్చడి, రైస్ వంటి వాటిని తయారు చేయడంతో పాటు వివిధ రకాల వంటల్లోనూ దీనిని పేస్ట్ గా చేసి వేస్తూ ఉంటాం. పుదీనా వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చక్కటి వాసనను కలిగి ఉండే ఈ పుదీనాను వాడడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. పుదీనాను తీసుకోవడం వల్ల మనం అతి ముఖ్యమైన మూడు లాభాలను పొందవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు.
పుదీనా వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, ప్రేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచడంలో పుదీనా మనకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పుదీనాలో 4 వేల 248 ఇంటర్నేషనల్ యూనిట్ల బీటా కెరోటీన్ ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ గా మారుతుంది. పుదీనాలో ఉండే ఈ బీటా కెరోటీన్ అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ రాకుంగా చేయడంలో, కణజాలం ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో, జబ్బుల బారిన పడకుండా రక్షించడంలో,కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో బీటా కెరోటీన్ రూపంలో ఉన్న విటమిన్ ఎ ఉపయోగపడుతుంది.
అదే విధంగా పుదీనా వాసన మెదడులో కాగ్నిటివ్ ఫంక్షన్స్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. నిర్ణయం తీసుకునే శక్తి, తర్కం చేసే శక్తి, విచక్షణ శక్తి వంటి వాటిని మెరుగుపరచడంలో మెదడును ఉత్తేజంగా ఉంచడంలో పుదీనా వాసన చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పుదీనాను వాసన చూడడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ వంటివి తగ్గుతాయి. పుదీనాను ఎక్కువగా వాడడం, పుదీనా వాసన పోకుండా పచ్చిగా ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పుదీనా మనకు ఉపయోగపడుతుందని దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.