Parsley : మనం అనేక రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరగాయల కంటే ఆకుకూరలు మనకు మూడు వంతుల లాభాన్ని ఎక్కువగా అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎక్కువగా తోటకూర, పాలకూర, మెంతి కూర, చుక్క కూర వంటి వాటిని తీసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా మనం పార్సిలీ లీఫ్ ను కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఈ పార్సిలీ లీఫ్ ను విదేశాల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు కూడా ఈ ఆకుకూర విరివిరిగా లభిస్తుంది. పార్సిలీ లీఫ్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముక పుష్టి పెరుగుతుంది. క్యాల్షియం శరీరానికి పట్టేటట్టు చేయడంలో ఈ ఆకుకూర ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. పార్సిలీ లీఫ్ లో 1640 మైక్రో గ్రాముల విటమిన్ కె ఉంటుంది. విటమిన్ కె తో పాటు ఇతర మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
దీనిలో ఉండే పోషకాలు మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం శరీరానికి పట్టేలా చేయడంలో ఉపయోగపడతాయి. ఎముక కణజాలాలను, ఎముకలను ధృడంగా ఉండచంలో పార్సిలీ లీఫ్ ఎంతో దోహదపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఈ ఆకుల్లో 133 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో పిహెచ్ స్థాయిలను సరిగ్గా ఉంచడంలో అలాగే రక్తంలో వ్యాధి నిరోధక శక్తిని పెండచంలో సహాయపడతాయి. పార్సిలీ లీఫ్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో క్షార గుణం పెరిగి ఆమ్ల గుణం తగ్గుతుంది. క్షార గుణం పెరగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇతర ఆకుకూరల కంటే పార్సిలీ లీఫ్ ను తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను మనం ప్రత్యేకంగా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే దీనిలో 1.7 గ్రాముల మినరల్స్ ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎముకలు బలహీనంగా మారడం, ఎముకలు గుల్ల బారడం వంటి, రక్తంలో ఆమ్లత్వం పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పార్సిలీ లీఫ్ ను తినడం వల్ల ఎముకలు కోల్పోయిన మినరల్స్ తిరిగి పొందుతాయి. అలాగే రక్తంలో మినరల్స్ స్థాయిలు పెరుగుతాయి. ఇతర ఆకుకూరలతో పాటు పార్సిలీ లీఫ్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.