Ranapala Aaku : ఈ ఒక్క మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల రక్తపోటు, డయాబెటిస్, మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాస సంబంధిత సమస్యలు, గాల్ బ్లాడర్ లో రాళ్లు, జీర్ణ సంబంధిత సమస్యలు, కామెర్లు, ఫైల్స్ ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. అలాగే ఈ మొక్క మనకు విరివిరిగా లభిస్తుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మొక్క ఏమిటి.. దీనిని ఎలా ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ మొక్కే రణపాల మొక్క. ఇంటి పరిసరాల్లో విరివిరిగా పెరుగుతుంది. వ్రణపాల మొక్కకు ఒక విశిష్టత ఉంది.
ఈ మొక్క ఆకు నుండే మరో మొక్క వస్తుంది. రణపాల మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్యసమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో ఈ మొక్క అద్భుతుంగా పని చేస్తుంది. ఈ మొక్క ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల లేదా ఈ మొక్క ఆకులను నేరుగా నమిలి తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. అలాగే ఈ ఆకులతో చేసిన టీని తాగడం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్లు కూడా తొలగిపోతాయి. ఈ ఆకుల టీ ని తాగడం వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శరీరంలో బలంగా, ధృడంగా మారుతుంది.

రణపాల మొక్కను ఉపయోగించి మనం నడుము నొప్పి, తలనొప్పి వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల తలనొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఫైల్స్ సమస్యను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రణపాల ఆకులో మిరియాలను ఉంచి బాగా నమిలి తినాలి. ఇలా తినడం వల్ల ఫైల్స్ సమస్య తగ్గు ముఖం పడుతుంది. అంతేకాకుండా ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులో పుండ్లు, అల్సర్లు వంటివి తగ్గుతాయి. అలాగే కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి గడ్డలు, వ్రణాలపై రాయడం వల్ల వ్రణాలు పగిలి మానిపోతాయి. రోజూ ఉదయం పరపగడును ఈ మొక్క ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది. కామెర్ల వ్యాధితో బాధపడే వారు వ్రణపాల మొక్క ఆకుల రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తాగడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. ఈ విధంగా రణపాల మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.