మొక్క‌లు

Ranapala Plant : ఈ మొక్క 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేస్తుంది..!

Ranapala Plant : మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. వాటిలో చాలా ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. ఈ ఔషధ మొక్కల వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాటి వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు. తులసి, వేప, మందారం ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలని మనం చూస్తూ ఉంటాం. ప్రయోజనకరమైన మొక్కలు చాలానే ఉన్నాయి. అందులో రణపాల కూడా ఒకటి. రణపాల మొక్కని చాలామంది వాళ్ళ ఇళ్లల్లో పెంచుతారు.

ఆఫీసుల్లో కూడా అందంగా ఉంటుందని ఈ మొక్కని పెంచుతారు. ఈ మొక్క ఆకులు మాత్రమే కాదు, వేర్లు, కాండం కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. సుమారు 150 కి పైగా వ్యాధులని తగ్గించే శక్తి ఈ మొక్కకి ఉంది. ఈ మొక్కను మీరు ఎలా గుర్తుపట్టాలంటే, ఈ ఆకు కొంచెం దళసరిగా ఉంటుంది. ఈ ఆకులు పులుపుగా, వగరుగా ఉంటాయి. ఈ మొక్క ఆకులతో చాలా సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా కిడ్నీల సమస్య, కిడ్నీలో రాళ్లు వంటి బాధలు తగ్గిపోతాయి.

Ranapala Plant this one can cure over 150 diseases

ఈ ఆకులని ఉదయం రెండు, రాత్రి రెండు తీసుకుంటే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు బయటకు వచ్చేస్తాయి. క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. డయాలసిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది ఈ రణపాల మొక్క. మూత్రపిండాల పనితీరు కూడా ఈ మొక్కతో మెరుగు పడుతుంది. పేగుల నుండి హానికరమైన వ్యర్ధాలు అన్నీ కూడా బయటకి వచ్చేస్తాయి. ఈ మొక్క జీర్ణాశయంలోని అల్సర్స్ ని తగ్గించగలదు.

మలబద్ధకం, అజీర్తి వంటి బాధల నుండి దూరంగా ఉంచగలదు. మలేరియా, టైఫాయిడ్ వంటి వాటి నుండి కూడా దూరంగా ఉంచుతుంది. శారీరిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. షుగర్ తో బాధపడే వాళ్ళు, ఈ ఆకులతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. తలనొప్పి తో బాధపడే వాళ్ళు, రణపాల ఆకులను తీసుకుని మెత్తగా నూరి ఆ పేస్ట్ ని నుదుటి మీద రాసుకుంటే, తలనొప్పిరగా తగ్గుతుంది. చెవిపోటుతో బాధపడే వాళ్ళు ఈ ఆకుల రసాన్ని చెవిలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా రణపాల మొక్కతో అనేక లాభాలను పొందొచ్చు.

Admin

Recent Posts