Ranapala Plant : ర‌ణ‌పాల మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాలి.. 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేయ‌గ‌ల‌దు..!

Ranapala Plant : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔషధ గుణాలు క‌లిగిన‌ మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వాటిని ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాంటి మొక్క‌ల‌లో ర‌ణ‌పాల మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను ఇంటికి అలంక‌ర‌ణగా కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి 150 కంటే ఎక్కువ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ర‌ణ‌పాల మొక్క వ‌ల్ల కలిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుల ద్వారా వ్యాప్తి చెందే మొక్క‌ల‌లో ర‌ణ‌పాల మొక్క ఒక‌టి. ఈ మొక్క ఆకు అంచుల నుండి కొత్త మొక్క‌లు వ‌స్తాయి. ఆయుర్వేదంలో ఎంతో విశిష్ట‌త క‌లిగిన మొక్కల‌లో ర‌ణ‌పాల మొక్క ఒక‌టి. ఈ మొక్క యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాల‌ను అధికంగా క‌లిగి ఉంటుంది. దీనిని ఉప‌యోగించి ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మస్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

ఈ మొక్క ఆకులు మందంగా ఉండి వ‌గ‌రు, పులుపు రుచిని క‌లిగి ఉంటాయి. ర‌ణ‌పాల మొక్క ఆకులు మూత్ర పిండాల స‌మ‌స్య‌లు, మూత్ర పిండాల‌లో రాళ్లు ఉన్న వారికి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ ఆకుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల లేదా ఉద‌యం ఈ ఆకుల క‌షాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగ‌డం వ‌ల్ల మూత్ర పిండాల‌లో, మూత్రాశ‌యంలో ఉండే రాళ్లు క‌రిగి పోతాయి. వాటి ప‌ని తీరు కూడా మెరుగుప‌డుతుంది. ఈ మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్రణ‌లో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో అల్సర్లు త‌గ్గుతాయి. అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా చాలా మంది జ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాలు, జ్వ‌రం వంటి వాటి బారిన ప‌డుతున్నారు. ర‌ణ‌పాల మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Ranapala Plant very useful to us must grow at home
Ranapala Plant

మ‌లేరియా, టైఫాయిడ్ వంటి జ్వ‌రాల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని 5 నుండి 6 చుక్క‌ల మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తపోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్స్ లోపం వ‌ల్ల వ‌చ్చే తెల వెంట్రుక‌ల స‌మ‌స్యతోపాటు జుట్టు రాల‌డం కూడా త‌గ్గుతుంది. కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపుల‌తో బాధ‌ప‌డే వారు ర‌ణ‌పాల మొక్క ఆకుల‌ను పేస్ట్ లా చేసి వాటిపై ఉంచి క‌ట్టు క‌ట్ట‌డం వ‌ల్ల గడ్డ‌లు, కురుపులు త‌గ్గుతాయి. 30 ఎంఎల్ మోతాదులో రోజూ రెండు పూట‌లా ఈ ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా కామెర్ల వ్యాధి న‌యం అవుతుంది. ఈ ఆకుల ర‌సాన్ని ఒక చుక్క మోతాదులో చెవిలో వేయ‌డం వ‌ల్ల చెవి పోటు త‌గ్గుతుంది. ర‌ణ‌పాల మొక్క ఆకుల క‌షాయాన్ని 40 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి 2 గ్రాముల తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌లో వ‌చ్చే యోని సంబంధిత స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి.

ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్ లా చేసి నుదుటిపై ప‌ట్టీలా వేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. గుండెను, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ ఆకుల క‌షాయాన్ని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగుల్లో ఉండే పురుగులు న‌శిస్తాయి. ర‌ణ‌పాల ఎండిన ఆకుల‌తో చేసిన టీ ని తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ మొక్క ఇంట్లో లేని వారు దీనిని వెంట‌నే ఇంట్లో పెంచుకోవాల‌ని, ఈ ర‌ణ‌పాల మొక్క ఆకుల‌ను తిన‌డం వల్ల మ‌న‌కు వ‌చ్చే ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్యల ఉండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts