మొక్క‌లు

Saraswati Plant : రోజూ రెండు ఆకులు చాలు.. న‌త్తి త‌గ్గుతుంది, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది..!

Saraswati Plant : చాలా మొక్కలు మనకు కనపడుతూ ఉంటాయి. వాటిలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా, ఎన్నో ఉన్నాయి. అయితే, ఔషధ గుణాలు ఉన్న మొక్కల గురించి, తప్పక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సరస్వతీ మొక్క కూడా, ఎన్నో ఔషధ గుణాలతో ఉంది. ఆయుర్వేద వైద్యంలో కూడా, సరస్వతీ మొక్కని వాడుతారు. ఈ మొక్క ఆకులని, ఆయుర్వేద మందుల్లో వాడడం జరుగుతుంది. సరస్వతి మొక్క నత్తిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఔషధ గుణాలు కూడా, ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి.

కొంతమంది, చిన్నపిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. బుద్ధి బలం లేకపోయినా కూడా ఈ ఆకుల పొడిని కానీ లేహ్యాన్ని కానీ, పిల్లలకి పెట్టడం మంచిది. అప్పుడు మాటలు వస్తాయి. బుద్ధి బలం కూడా పెరుగుతుంది. సరస్వతి ఆకులని మెమరీ బూస్టర్ గా వాడతారు. మూడు సరస్వతి ఆకుల్ని తీసుకున్నట్లయితే, మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తిని కూడా ఈజీగా పెంచుకోవచ్చు.

Saraswati Plant is very beneficial for those who have memory problems

సరస్వతీ మొక్క ఆకుల్ని నీడలో ఎండబెట్టి, అందులో ఐదు బాదంపప్పులు, రెండు మిరియాలు, వేడి నీళ్ళు పోసి, మెత్తని పేస్ట్ లాగ చేసుకుని, ఈ పేస్ట్ ని, ఒక క్లాత్ లో వేసి, వడకట్టి ఈ రసంలో తేనెను కలిపి, 40 రోజులు పాటు తీసుకుంటే, మాటలు పిల్లలకి సరిగ్గా వస్తాయి.

సరిగ్గా, పిల్లలకి మాటలు రాకపోయినట్లయితే ఇలా చేయడం మంచిది. నత్తిని తగ్గించే శక్తి కూడా, ఈ ఆకులకి ఉంది. మెదడు, నరాలు బలంగా ఉంటాయి. చాలా రకాల వ్యాధుల్ని దూరం చేయగలవు. మెదడుని మాత్రమే కాదు. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అయితే, సొంత వైద్యం చేసుకోవడం కంటే ఆరోగ్య నిపుణులు సలహా తీసుకోవడం మంచిది. వాడే ముందు, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆ తర్వాత మాత్రమే తీసుకోండి.

Admin

Recent Posts