Vempali : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు వ‌ద‌లొద్దు.. ఎందుకంటే..?

Vempali : వెంప‌లి చెట్టు.. ఈ మొక్క గురించి తెలియని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ చెట్లు మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే గుంపులు గుంపులుగా క‌నిపిస్తాయి. ద‌స‌రా స‌మ‌యంలో వెంప‌లి చెట్టును బ‌తుక‌మ్మ‌గా అల‌క‌రించి పూజిస్తారు. కేవ‌లం ఆధ్మాతిక్మంగానే కాదు ఆరోగ్య ప‌రంగా కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం టెప్రోసియా ప‌ర్ ప్యూరియా అంటారు. దీనిని ఇంగ్లీష్ లో వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు. వెంప‌లి చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. వెంప‌లి చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి దీని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి తరుణంలో మూత్ర‌పిండాల‌కు సంబంధించిన అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు వెంప‌లి చెట్టును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పాడైపోయిన మూత్ర‌పిండాల‌ను సైతం తిరిగి బాగు చేసే అద్భుత‌మైన గుణం ఈ వెంప‌లి చెట్ల‌కు ఉంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెంప‌లి చెట్టు వేర్ల‌ను సేక‌రించి నీడ‌లో ఆర‌బెట్టాలి. వేర్లు పూర్తిగా ఎండిన త‌రువాత పొడిగా చేసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. మూత్ర‌పిండాలు పాడైపోయిన వారు ఈ చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో క‌లుపుకుని వారం రోజు పాటు తాగాలి.

Vempali plant do not forget to take it
Vempali

ఇలా తాగ‌డం వ‌ల్ల పాడైపోయిన మూత్ర‌పిండాలు తిరిగి బాగ‌వ‌డంతో పాటు మూత్ర‌పిండాల‌కు సంబంధించిన అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. అలాగే ఈ చెట్టు వేర్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాలు ధృడంగా మార‌తాయి. దంతాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే ఈ చెట్టు ఆకులను పొడిగా చేసుకుని ఈ పొడిలో నీటిని క‌లిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ తో కూడా దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. అలాగే కామెర్ల వ్యాధిని న‌యం చేయ‌డంలో కూడా వెంప‌లి చెట్టు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వెంప‌లి చెట్టు స‌మూల భాగాన్ని సేక‌రించి శుభ్రంగా క‌డిగి నీటిలో వేసి మ‌రిగించాలి.

త‌రువాత ఈ డికాష‌న్ ను రోజుకు రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల కామెర్ల వ్యాధి త‌గ్గుతుంది. అలాగే ఈ డికాష‌న్ ను తాగ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ది అవుతుంది. వెంప‌లి చెట్టు ఆకుల పొడికి స‌మానంగా ప‌టిక బెల్లాన్ని క‌లిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మొల‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే వెంప‌లి చెట్టు మొత్తాన్ని 5 గ్రాముల మోతాదులో తీసుకుని నీటిలో వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌కట్టి దానికి ప‌టిక బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మెద‌డు చుర‌కుగా ప‌ని చేస్తుంది. అజీర్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నప్పుడు వెంప‌లి చెట్టు వేరును నీటిలో వేసి మ‌రిగించి క‌షాయంలా చేసుకోవాలి.

ఈ క‌షాయాన్ని రోజుకు ఒక‌సారి తాగ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. విరోచ‌నాల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల విరోచ‌నాలు త‌గ్గుతాయి. అదే విధంగా ఈ చెట్టు వేరును నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ ర‌సాన్ని మింగుతూ ఉంటే గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అదే విధంగా ఈ చెట్టు ఆకుల‌ను పేస్ట్ గా చేసి గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఈ విధంగా పిచ్చి మొక్క‌గా భావించే వెంప‌లి చెట్టు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts