politics

Roja : పెళ్లికి ఓకే అనుకున్నారు.. అయినా రోజా, సెల్వ‌మ‌ణి పెళ్లి చేసుకోకుండా 11 ఏళ్ల పాటు ఆగారు.. ఎందుకో తెలుసా..?

Roja : నటి, జబర్దస్త్ జడ్జి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్ తో కలిసి ప్రేమ త‌పస్సు అనే మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన రోజా.. సీతారత్నంగారి అబ్బాయితో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుసగా సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం రాజ‌కీయ నాయకురాలిగా ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు రోజా.

ఇక వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే.. రోజా ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. చెంబురతి మూవీతో రోజా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీని సెల్వమణినే తెర‌కెక్కించారు. ఈ సినిమా స‌మ‌యంలోనే సెల్వమణి, రోజాల‌ మ‌ధ్య స్నేహం ఏర్ప‌డ‌గా.. ఆ స్నేహం ప్రేమ‌కు దారి తీసింది. అయితే సెల్వమణి తాను ప్రేమిస్తున్న విష‌యాన్ని మొద‌ట రోజాకు కాకుండా.. ఆమె త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న రోజా.. మొద‌ట షాక్ అయినా ఆ త‌ర్వాత సెల్వమణితో పెళ్లికి ఒకే చెప్పింది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. రోజా ఓకే చెప్పాక‌ సెల్వమణిని ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి 11 ఏళ్లు ప‌ట్టింద‌ట‌.

roja and selvamani took 11 years to marriage

ఈ ఆలస్యానికి కారణమేంటంటే.. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్‌ ల‌ను వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. అందుకే ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో వారిని సెటిల్ చేయాలని భావించింద‌ట రోజా. అందులో భాగంగానే సమరం అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర‌య్యాయ‌ట‌. రోజా అనేక సార్లు షూటింగ్ లో గాయ‌ప‌డింది. ఎలాగోలా ఈ సినిమా విడుద‌లైంది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా విఫలమైంది. అలా ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు రోజా మరికొంత కాలం చిత్రాలు చేయాల్సి వచ్చింది.

ఇలా అనుకోని సంఘటనలు వీరి వివాహాన్ని వాయిదా వేశాయి. చివ‌రకు రోజా, సెల్వమణిలు 2002లో పెళ్లి చేసుకోగా.. వీరికి కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ లోహిత్ జ‌న్మించారు. సినిమాలకు కొంత విరామం తర్వాత రోజా.. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Admin

Recent Posts