Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home politics

అప్ప‌ట్లో ప్రధాని వాజ్‌పేయిపై పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ‌.. స‌భ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌..

Admin by Admin
June 10, 2025
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అది 1998వ సంవత్సరం. బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు… స్పీకర్ సార్, కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను అంటూ ఒక పుస్తకాన్ని తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది. (కాంగ్రెస్+ సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది).

బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా, కొత్త రికార్డులు నెలకొల్పింది. ముంద్రా స్కామ్, చౌరత్ లాటరీ స్కామ్, బోఫోర్స్ స్కామ్, సుఖ్రం స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, JMM ముడుపుల స్కామ్, హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది.. ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి స్పీకర్ సర్, ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము అంటూ గోల చేశారు. జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ దయచేసి నన్ను చదవనీయండి. పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను అంటూ, మళ్ళీ చదవ సాగాడు. సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది. తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది. ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం.. ఇక తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ, ఆ పుస్తకం పేరు చెప్పకుండా, చదవనీయమని పట్టుబట్టారు.

what happened then when vajpayee unbelievable motion

అప్పుడు పెర్నాండెజ్ గారు సరే, స్పీకర్ సర్! గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి, చెబుతున్నాను.. ఈ పుస్తకం మరేదో కాదు, లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే CPM వాళ్ళు జారీచేసిన CPI(M) మేనిఫెస్టో. అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ, ఏం జరిగింది, ఎందుకీ నిశ్శబ్దం…?? మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు, పేరు వినగానే, మీ గొంతులు మూగ పోయాయెందుకు….?? సిగ్గు పోయిందా మీకు….?? మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా…?? చదివినా, మీ భావజాలం మీకే నచ్చలేదా…?? ఇలాంటి భావజాలం గల మీరు, మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో, చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది. ఇకనైనా మీరు ఆలోచించి, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే, మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది.. అంటూ ముగించారు. ఆయన చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో నిజంగానే కమ్యూనిస్టులు చాలా రాష్ట్రాల్లో అంతమవడం మనం చూశాం.

Tags: vajpayee
Previous Post

దోశను, చాక్లెట్లను, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా?

Next Post

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

Related Posts

lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025
పోష‌ణ‌

ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.