Beetroot : బీట్‌రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ?

Beetroot : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీట్ రూట్ ఒక‌టి. ఇది చ‌ప్ప‌గా ఉంటుంది. అలాగే పింక్ రంగులో ఉంటుంది. క‌నుక దీన్ని చాలా మంది నేరుగా తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీట్‌రూట్ జ్యూస్‌ను మాత్రం చాలా మంది తాగుతుంటారు. అయితే బీట్ రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ? ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే..

Beetroot : బీట్‌రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ?

బీట్‌రూట్‌ను రోజూ తిన‌వ‌చ్చు. ఇది పూర్తిగా సుర‌క్షితమే. అయితే బీట్‌రూట్‌ను నేరుగా తింటే రోజూ ఒక క‌ప్పు మోతాదులో స‌రిపోతుంది. అదే జ్యూస్ అయితే ఒక గ్లాస్ మేర తాగ‌వ‌చ్చు. ఈ విధంగా రోజూ బీట్‌రూట్‌ను నిర్భ‌యంగా తీసుకోవ‌చ్చు. దీంతో ఎలాంటి దుష్ప‌రిణామాలు ఏర్ప‌డ‌వు.

బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవడం వ‌ల్ల అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌లు ఉండ‌వు.

బీట్‌రూట్ లో విట‌మిన్ బి9 లేదా ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గ‌ర్భిణీలకు ఎంత‌గానో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డుతుంది.

బీట్‌రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. బీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

అయితే బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాంటి వారు దీన్ని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

Share
Editor

Recent Posts