ఈమధ్య చాలా మంది వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది హెల్త్‌కు మంచిదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్కటే తినడం మంచిది కాదని, దీంతోపాటు రెగ్యులర్‌గా వైట్ రైస్ కూడా తినాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వల్ల కొన్ని సమస్యలు కూడా రావొచ్చంటున్నారు. వైట్ రైస్‌లో న్యూట్రియెంట్స్‌తోపాటు యాంటీ న్యూట్రియెంట్ లక్షణాలు కూడా ఉంటాయి.
వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో 80 శాతం ఎక్కువగా ఆర్సెనిక్ అనే మెటల్ ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిసిటీని పెంచుతుంది. పైన పొట్టు ఉండే బ్రౌన్ రైస్ వంటివి కొందరికి త్వరగా జీర్ణం కాకపోవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ డైజేషన్ ఇష్యూస్ ఉన్నవాళ్లకు ఇవి పడకపోవచ్చు. పైపొరలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియెంట్.
వైట్ రైస్‌లో గ్లూటెన్ ఉండదు. అందువల్ల అలర్జీ సమస్యలు రావు. వైట్ రైస్ తినడం వల్ల జింక్ తీసుకునే శక్తి పెరుగుతుంది. తగినంత జింక్ అందితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఒక కప్పు వైట్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. న్యూట్రియెంట్స్‌లో కొన్ని తేడాలు ఉన్నా, రెండింటిలోనూ పోషకాలు ఉన్నాయి కాబట్టి వైట్ రైస్‌ను కూడా తీసుకోవచ్చు.