Raisins : కిస్మిస్‌లు.. వీటినే ఇంగ్లిష్‌లో రైజిన్స్ అని కూడా అంటారు. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అందువల్ల కిస్మిస్ లను తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు. వీటిని పలు రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇక కొందరు వీటిని రోజూ నేరుగానే తింటుంటారు. కిస్మిస్‌లను ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిని బేకరీ పదార్థాలు, సలాడ్స్, స్వీట్లలో వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి వస్తుంది. ఇక కిస్మిస్‌లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు కిస్మిస్‌లను తినవచ్చా.. వద్దా.. అనే సందేహం చాలా మందిలో ఉంది. ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కిస్మిస్‌లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తినకూడదని షుగర్ వ్యాధిగ్రస్తులు భావిస్తుంటారు. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం షుగర్ ఉన్నవారు అయినా సరే కిస్మిస్‌లను తినవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు. ఎందుకంటే కిస్మిస్‌లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల షుగర్ ఉన్నవారు కూడా కిస్మిస్‌లను నిర్భయంగా తినవచ్చు. అయితే వీరు కిస్మిస్‌లను మోతాదులోనే తినాలి. అధికంగా తినరాదు. తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కనుక తక్కువ మోతాదులో వీటిని తినవచ్చు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు.
ఇక కిస్మిస్‌లను తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా మనకు అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ప్రధానంగా వీటిలో ఉండే ఐరన్ రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే కిస్మిస్‌లలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. వీటిల్లో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని తగ్గిస్తుంది. దీంతో హైబీపీ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు వంటివి రావు.
ఇక కిస్మిస్‌లను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం, గ్యాస్ సమస్యలు కూడా ఉండవు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కిస్మిస్‌లను తినడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని కొవ్వు కరగుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. కనుక కిస్మిస్‌లను ఎవరైనా సరే తప్పక తినాల్సిందే. ముఖ్యంగా వీటిని రాత్రి పూట నీటిలో గుప్పెడు మోతాదులో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. నీరసం, అలసట, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. ఇలా కిస్మిస్‌లతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.