Cabbage : ఆకుపచ్చని కూరగాయలను, ఆకుకూరలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని మనకు వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. ఇందులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల కూరగాయలు, ఆకుకూరలను తింటే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బీపీ తగ్గుతుంది. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.
క్యాబేజీలో విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం.. అధికంగా ఉంటాయి. అందువల్ల క్యాబేజీని తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే క్యాబేజీని తినేందుకు కొందరు వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకంటే క్యాబేజీని తినడం వల్ల మెదడులో పురుగులు ఏర్పడుతాయని భావిస్తుంటారు. అయితే దీనిపై వైద్యులు ఏమని సమాధానం ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీని తింటే మెదడులో పురుగులు ఏర్పడుతాయన్న విషయంలో ఎంతమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని.. నిర్భయంగా క్యాబేజీని తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. క్యాబేజీని తినడం వల్ల ఎలాంటి హాని కలగదని, ముఖ్యంగా మెదడులో ఎలాంటి పురుగులు ఏర్పడవని చెబుతున్నారు. కనుక క్యాబేజీని ఎవరైనా సరే నిరభ్యంతరంగా తినవచ్చు.
ఇక మెదడులో పురుగుల పలు ఇతర కారణాల వల్ల ఏర్పడుతాయి. అంతేకానీ.. క్యాబేజీని తినడం వల్ల అవి ఏర్పడవు. మనం పాటించే అలవాట్ల వల్లే మెదడులో పురుగులు ఏర్పడుతాయి. చేతులను శుభ్రంగా ఉంచుకోకపోయినా, తినేముందు చేతులను కడుక్కోకపోతే.. అపరిశుభ్రంగా ఉండడం వల్ల.. క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి పలు చోట్లకు చేరుకుని పురుగులను వ్యాప్తి చెందిస్తాయి. కనుక పరిశుభ్రంగా ఉండాలి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.