Mangoes With Milk : మామిడికాయల సీజన్ వచ్చేసింది. మనకు రకరకాల వెరైటీలకు చెందిన మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరి ఇష్టానికి తగినట్లుగా వారు మామిడి కాయలను తింటున్నారు. అయితే మామిడి కాయలను తినేవారికి అనేక సందేహాలు వస్తుంటాయి. మామిడి కాయలను పాలతో కలిపి తీసుకోవచ్చా ? అని అనుమానపడుతుంటారు. మరి దీనికి వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు. కానీ మామిడి పండ్లు, పాలను కలిపి మిల్క్ షేక్ రూపంలో తీసుకోవాలి. అది కూడా చల్లగా తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఈ మిల్క్ షేక్ వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. పైగా వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.
మామిడి పండ్ల మిల్క్ షేక్‌లో మినరల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, మెగ్నిషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అలాగే కాపర్, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. కనుక మన శరీరానికి పోషణ లభిస్తుంది. కాబట్టి ఈ మిల్క్ షేక్‌ను తాగితే పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. చిన్నారులకు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
మామిడిపండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, విటమిన్ ఇ, బి1, బి2 లు మామిడి పండ్ల ద్వారా లభిస్తాయి. కనుక అన్ని విధాలుగా మామిడిపండ్ల మిల్క్ షేక్ మనకు ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవచ్చు. అందులో అనుమాన పడాల్సిన పనిలేదు.