రోజూ మనకు తాగేందుకు అనేక రకాల టీ లు అంటుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ టీ ఒకటి. అలాగే బ్లాక్ టీని కూడా కొందరు తాగుతుంటారు. ప్రత్యేకమైన తేయాకులతో గ్రీన్ టీని తయారు చేస్తారు. బ్లాక్ టీ అంటే సాధారణ టీ పొడి డికాషన్. అయితే రెండింటిలో మనకు ఏది మంచిది ? దేన్ని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీని తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. చర్మం కాంతివంతంగా మారుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బ్లాక్ టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మూడ్ మారుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త నాళాలు సురక్షితంగా ఉంటాయి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
ఇక గ్రీన్ టీ కన్నా బ్లాక్ టీలోనే కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ నాడీ మండల వ్యవస్థప ప్రభావం చూపుతుంది. అందువల్లే ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. అలర్ట్‌గా ఉంటారు.
గ్రీన్ టీ, బ్లాక్ టీ.. రెండింటి వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అయితే అధిక బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. కనుక వారు రోజూ గ్రీన్ టీని తాగాలి. ఇక మిగిలిన ఏ సమస్యలు ఉన్నా సరే వారు రోజూ బ్లాక్ టీని తాగితే మంచిది. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365