అధిక బరువును తగ్గించుకోవాలని చూసే చాలా మంది తాము తినే పిండి పదార్థాలతో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. వాటిని ఎక్కువగా తింటే బరువు పెరుగుతామేమోనని ఖంగారు పండుతుంటారు. అయితే నిజానికి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో అన్నం, చపాతీలు ముఖ్య భాగంగా మారాయి. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి.
అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రోజూ రాత్రి అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటారు. ఎందుకంటే గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది. దాని గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ కూడా తక్కువే. కనుక షుగర్ లెవల్స్ పెరగవు. పైగా కడుపు నిండిన భావన కలుగుతుంది. గోధుమల్లో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది. కనుక చాలా మంది సహజంగానే రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటారు.
అయితే అధిక బరువు తగ్గేందుకు చపాతీలు సహాయ పడే మాట వాస్తవమే. కానీ అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని చపాతీలను తినాలి ? అంటే..
6 ఇంచుల చిన్న చపాతీలో సుమారుగా 71 క్యాలరీలు ఉంటాయి. అధిక బరువు తగ్గాలంటే కేవలం రాత్రి మాత్రమే కాదు, మధ్యాహ్నం కూడా చపాతీలను తినాలి. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2, రాత్రి 2 చపాతీలను భిన్న రకాల కూరలతో తినాలి. దీంతోపాటు క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, టమాటా వంటి కూరగాయలతో చేసిన సలాడ్‌ను తినాలి. పండ్లను ఒక బౌల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలతో సులభంగా బరువు తగ్గవచ్చు. అందువల్ల రోజుకు 4 చపాతీలను ఈ విధంగా తింటే అధిక బరువును తగ్గించుకోవడం సులభతరం అవుతుంది.