రోజూ మనం తిరిగే వాతావరణం, నివసించే ప్రదేశాల్లో ఉండే దుమ్ము, ధూళి మన తలలో చేరుతుంటాయి. అందువల్ల రెండు రోజులకు ఒకసారి అయినా సరే కచ్చితంగా తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు రాకుండా ఉంటుంది. అయితే జుట్టుకు నూనె రాయాలా ? అది అవసరమా ? దాంతో ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయా ? అంటే..
అవును.. జుట్టుకు నూనె రాయాల్సిందే. అయితే జుట్టుకు నూనెను రాసి ఎక్కువ సేపు ఉంచకూడదు. జిడ్డుగా ఉండే జుట్టు అయినా సరే నూనె రాయాల్సిందే. కాకపోతే జుట్టుకు నూనెను రాసి బాగా మర్దనా చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి.
ఇక పొడి జుట్టు ఉన్నవారు అయితే జుట్టుకు నూనె రాశాక 30 నిమిషాల పాటు ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. కానీ ఎవరైనా సరే కచ్చితంగా జుట్టుకు నూనెను రాయాలి. నూనె రాయడం వల్ల జుట్టుకు జీవం అందుతుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
వారంలో కనీసం రెండు సార్లు అయినా సరే జుట్టుకు నూనె రాసి మర్దనా చేసి తరువాత తలస్నానం చేయాలి. దీంతో జుట్టుకు పోషణ లభిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
మార్కెట్‌లో మనకు రక రకాల హెయిర్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే సహజసిద్ధమైన నూనెలు అయితే మంచిది. కొబ్బరినూనె, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి రాయవచ్చు. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
జుట్టుకు నూనె రాయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అందువల్ల వారంలో కనీసం 2 సార్లు అయినా సరే జుట్టుకు నూనెను బాగా రాసి మర్దనా చేసి తలస్నానం చేస్తుండాలి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. బాగా పెరుగుతాయి.