ప్ర‌శ్న - స‌మాధానం

జొన్నరొట్టె diabetes పేషెంట్స్ కి మంచిదేనా?

జొన్న రొట్టె & డయాబెటిస్ – నిజమెంత? బిజినెస్ ఎంత? మొదటగా, జొన్న రొట్టె తినొచ్చా లేక తినకూడదా? అని డయాబెటిక్ పేషెంట్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఫుడ్ మంచిదే, గమనించాల్సింది క్వాంటిటీ, టైమింగ్, కాంబినేషన్ అన్న సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. సబ్జెక్టు క్లియర్ అవ్వాలంటే కొన్ని పాయింట్లు చూద్దాం. డయాబెటిస్ ఎలా వస్తుంది? కొంతమందికి జెనెటిక్ (తల్లిదండ్రుల నుంచి వస్తుంది). చాలా మందికి లైఫ్‌స్టైల్ కారణంగా (ఊబకాయం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఆహారపు అలవాట్లు) కార‌ణంగా డ‌యాబెటిస్ వ‌స్తుంది.

స్ట్రెస్, హార్మోనల్ ఇష్యూస్, నిద్రలేమి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. జొన్న రొట్టె ఎందుకు హైలైట్ అవుతోంది? Low Glycemic Index (GI) – అంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ని తక్కువగా, నెమ్మదిగా పెంచుతుంది (Rice కన్నా, Wheat కన్నా బెట్టర్). Fiber Rich – దీని వల్ల గ్లూకోజ్ అబ్సార్బ్షన్ స్లో అవుతుంది, దీంతో ఇన్‌సులిన్ రెసిస్టెన్స్ తగ్గవచ్చు. Protein & Iron Content – గ్లూకోజ్ మెటబాలిజం బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కానీ… బిజినెస్ మ్యాటర్ మరింత హైలైట్!

jowar roti really helps for diabetes patients or what

ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ బూమ్ వచ్చేసింది. షుగర్-ఫ్రీ బిస్కట్లు, మిల్లెట్-based అన్నం, నూనె లేని మినప రొట్టి… ఇలా పేర్లు మార్చి అదే నామమై, అదే తామమై, డబ్బులు బాగా దోచేస్తున్నారు. ఫుడ్ పరిశ్రమలో డయాబెటిస్ పేషెంట్లకు టార్గెట్ మార్కెట్ వృద్ది చెందుతోంది. ఇండియాలో డయాబెటిస్ పేషెంట్లు – దాదాపు 80 మిలియన్లు ఉన్న‌ట్లు అంచ‌నా. డ‌యాబెటిస్ మెడిసిన్స్ & ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెట్ – ₹20,000 కోట్లు దాటింది! దీంట్లో నిజంగా అవసరమైనది ఎంత? లాభం కోసం క్రియేట్ చేసిన అపోహ ఎంత? అన్నది ప్రశ్నించాల్సిన విషయం. తీర్మానం – మీ డైట్ డిసిప్లిన్ మీరే డిసైడ్ చేయాలి!

మిల్లెట్స్ మంచివే, కానీ అవే మినహాయించే మాయలో పడొద్దు! జొన్నరొట్టె ఓప్షన్ మాత్రమే, మెడిసిన్ కాదని అర్థం చేసుకోవాలి. సరిగ్గా ప్లానింగ్ చేసుకొని, హోమ్‌మెడ్ ఫుడ్‌తో, ఫిజికల్ యాక్టివిటీతో, షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయొచ్చు. దయచేసి బిజినెస్ మాయలో పడకుండా నిజమైన ఆరోగ్యాన్ని ఎంచుకోండి.

Admin

Recent Posts