అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

rice or chapathi which one is better for diabetics

అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ గ్లూకోజ్‌ వెంటనే రక్తంలో కలుస్తుంది. అన్నం గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ కనుక మనం దాన్ని తిన్న వెంటనే మన రక్తంలో వేగంగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. అందుకనే అన్నం తినవద్దని చెబుతారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కేవలం అన్నం మాత్రమే తింటే.. అంటే.. కూరలు గట్రా ఏమీ కలుపుకోకుండా ఒట్టి అన్నం మాత్రమే తింటే గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ కనుక షుగర్‌ లెవల్స్‌ అమాంతం పెరుగుతాయి. కానీ మనం ఒట్టి అన్నంను అలాగే తినం కదా. అందులో కూరనో, పచ్చడో, పెరుగో, చారో కలుపుకుని తింటాం. దీంతో ఆ మొత్తం మిశ్రమం యొక్క గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తగ్గుతుంది. దీని వల్ల మనం ఆ అన్నం, ఇతర పదార్థాల మిశ్రమాన్ని తిన్న వెంటనే షుగర్‌ లెవల్స్‌ పెరగవు. కనుక అన్నంను కూడా తినవచ్చు. కాకపోతే తక్కువ మోతాదులో తింటే మంచిది.

అయితే రాత్రి పూట కొందరు అన్నంకు బదులుగా చపాతీలను తింటారు. రెండింటికీ పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే గోధమలపై పొట్టు తీశాకే వాటిని మిల్లులో ఆడించి పిండి తయారు చేస్తారు. అందులో ఫైబర్‌ అస్సలు ఏమాత్రం ఉండదు. అలాంటప్పుడు దాంతో చపాతీలు చేసుకుని తిన్నా ప్రయోజనం ఉండదు. దాని గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగానే.. అన్నం లాగే ఉంటుంది. కనుక రాత్రి పూట చపాతీలను తిన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. వాటికి బదులుగా సిరి ధాన్యాలను తినాలి. వాటిల్లో లోపలి పొరల్లోనూ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల సిరిధాన్యాలను తిన్న వెంటనే షుగర్‌ లెవల్స్‌ పెరగవు. కాబట్టి రాత్రి పూట సిరిధాన్యాలను తినడం అలవాటు చేసుకుంటే షుగర్‌ బాగా తగ్గుతుంది. కంట్రోల్‌లో ఉంటుంది.

ఇక డయాబెటిస్‌ ఉన్నవారు అంతగా అన్నం తినాలనుకుంటే మధ్యాహ్నం పూట కొద్దిగా తినవచ్చు. దాంతోపాటు కూరగాయాలు, తాజా పండ్లు కూడా తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉంటాయి. ఇలా ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

అయితే రాత్రిపూట లేదా పగలు ఎప్పుడైనా సరే డయాబెటిస్‌ ఉన్నవారు బ్రౌన్‌ రైస్‌ను కూడా తీసుకోవచ్చు. సిరిధాన్యాలంత కాకపోయినా ఈ రైస్‌లోనూ ఫైబర్‌ ఉంటుంది. అలాగే బ్రౌన్‌ రైస్‌ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువ. కనుక డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు బ్రౌన్‌ రైస్‌ను కూడా తినవచ్చు. అన్నం, చపాతీలు తక్కువ మొత్తంలో తిన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక సిరిధాన్యాలు లేదా బ్రౌన్‌ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్‌ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Share
Admin

Recent Posts