రోజూ చాలా మంది తమ ఇష్టాలకు అనుగుణంగా పాలను తాగుతుంటారు. కొందరు వెన్న తీసిన పాలను తాగుతారు. కొందరు స్వచ్ఛమైన పాలను తాగుతారు. ఇక కొందరు గేదె పాలు తాగితే కొందరు ఆవు పాలను తాగుతారు. అయితే ఏ పాలు అయినా సరే మనకు ఆరోగ్యకరమే. అయితే పాలను ఉత్పత్తి చేసే డెయిరీ కంపెనీలు పాలను పాశ్చరైజ్ చేస్తాయి. అలా ఎందుకు చేస్తారు ? దాని వల్ల అలాంటి పాలను తాగితే మన ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం పడుతుందా ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి పాలలో రోగాలను కలగజేసే సూక్ష్మ జీవులు ఉంటాయి. సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది. ఇది మనకు టైఫాయిడ్ జ్వరాన్ని కలగజేస్తుంది. అలాగే టీబీని కలిగించే సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి. కనుక పచ్చిపాలను తాగరాదు. కచ్చితంగా పాలను మరిగించే తాగాలి.
ఇక డెయిరీ కంపెనీలలో పాలలోని సూక్ష్మ జీవులను పూర్తిగా నశింపజేసేందుకు పాశ్చరైజ్ చేస్తారు. అంటే పాలను 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. దీంతో పాలలో ఉండే సూక్ష్మ జీవులు దాదాపుగా చనిపోతాయి. అయితే కొన్ని సూక్ష్మ జీవులు మాత్రం చనిపోవు. అవి రక్షణ పొరను ఏర్పాటు చేసుకుని అలాగే ఉంటాయి. దీంతో వాటిని చంపేందుకు వేడి చేసిన పాలను 0 డిగ్రీలకు చల్లబరుస్తారు. తరువాత ఆ పాలను మళ్లీ వేడి చేస్తారు.
అయితే అప్పటికే రక్షణ పొరను ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ జీవులకు ఇక శక్తి ఉండదు. దీంతో మళ్లీ పాలను 100 డిగ్రీలకు వేడి చేయగానే ఆ సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీంతో పాలు శుభ్రమవుతాయి. అందువల్ల పాశ్చరైజ్ చేస్తే పాలలో ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి. కానీ పాలలో ఉండే పోషకాలు మాత్రం నశించవు. కనుక పాశ్చరైజ్ చేయబడిన పాలను నిక్షేపంగా తాగవచ్చు.
ఇక మన ఇంట్లో పాశ్చరైజ్ చేసేందుకు వీలు కాదు. కనుక మనం పాలను కచ్చితంగా 15 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో సూక్ష్మ జీవులు దాదాపుగా నశిస్తాయి. అలాంటి పాలనే తాగాలి. పచ్చి పాలను తాగరాదు.