Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజుకు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే.. ఏ వ్యాధులూ రావు.. వెల్లడించిన సైంటిస్టులు..

Admin by Admin
March 4, 2021
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న
Share on FacebookShare on Twitter

పండ్లు.. కూరగాయలు.. ఏ రకానికి చెందిన పండులో అయినా.. కూరగాయల్లో అయినా.. అనేక పోషకాలు ఉంటాయి. ఒక్కో రకమైన పండు లేదా కూరగాయతో మనకు భిన్న విధాలైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే అనేక రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సిన పనిలేదు. 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను నిత్యం తీసుకుంటే చాలు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎక్కువ కాలం జీవించవచ్చు. అలా అని మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

2 Fruits And 3 Vegetables A Day can prevent diseases and gives longer life

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్‌ అనే జర్నల్‌లో సైంటిస్టులు సుదీర్ఘకాలం పాటు చేపట్టిన ఓ అధ్యయనానికి చెందిన వివరాలను తాజాగా ప్రచురించారు. వాటి ప్రకారం.. నిత్యం ఏవైనా 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను తీసుకుంటే చాలు.. ఎక్కువ ఏళ్ల పాటు జీవించవచ్చు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 12 శాతం తగ్గుతాయి. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 10 శాతం వరకు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు 35 శాతం వరకు తగ్గుతాయి. సైంటిస్టులు దాదాపుగా 30 ఏళ్ల పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని దేశాలకు చెందిన సుమారుగా 20 లక్షల మందిపై అధ్యయనాలు చేసి తాజాగా ఈ వివరాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే నిత్యం ఏవైనా సరే.. 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇక అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్‌ అన్నె థార్న్‌డికె అయితే.. మనం చేసే భోజనంలో సగం వరకు ప్లేట్‌ను పండ్లు, కూరగాయలతో నింపాలని సూచించారు. నిత్యం ఏవైనా 2 రకాల సిట్రస్‌ (నిమ్మజాతి) పండ్లను తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు.

Tags: American heart associationdiseasesfruitshealthhealthy lifevegetablesఅమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ఆరోగ్యంఆరోగ్య‌క‌ర‌మైన జీవితంకూర‌గాయ‌లుపండ్లువ్యాధులు
Previous Post

కాకరకాయల్లో ఉండే చేదును తగ్గించేందుకు 5 చిట్కాలు..!

Next Post

వెగన్‌ డైట్‌ అంటే ఏమిటి ? దాని వల్ల కలిగే లాభాలు..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

చ‌క్కెర అధికంగా తింటే గుండె పోటు వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే కానీ.. అక్క‌డే ఉంది అస‌లు కిటుకు..

May 30, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ న‌వ్వితే హార్ట్ ఎటాక్ అస‌లు రాద‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!