డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు.

cinnamon can reduce sugar levels in diabetics says scientists

మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో రక్తంలో షుగర్‌ స్థాయిలను మెరుగు పరిచేందుకు దాల్చిన చెక్క సహాయం చేస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

సైంటిస్టుల పరిశోధనల్లో భాగంగా కొంతమంది వాలంటీర్లకు నిత్యం 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకు దాల్చినచెక్కను ట్యాబ్లెట్ల రూపంలో ఇచ్చారు. వారిని 4 నుంచి 18 వారాల పాటు పరిశీలించారు. ఈ క్రమంలో దాల్చిన చెక్క ట్యాబ్లెట్లను తీసుకున్నవారిలో షుగర్‌ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. మొత్తం ఫలితాలను విశ్లేషించగా డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌తోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గినట్లు నిర్దారించారు. అందువల్ల దాల్చిన చెక్కను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం లేదా ఆ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు.

Share
Admin

Recent Posts