Fenugreek Seeds For Diabetes : మెంతుల‌ను రోజూ తీసుకుంటే షుగ‌ర్ త‌గ్గుతుందా..? సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో ఏం తేలింది..?

Fenugreek Seeds For Diabetes : షుగ‌ర్ వ‌చ్చిందా.. అయితే రోజూ ఉద‌యం,సాయంత్రం నాలుగు మెంతి గింజ‌ల‌ను నోట్లో వేసుకోండి. ఇక దాని గురించి ప‌ట్టించుకోకండి అనే స‌ల‌హాను షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు వినే ఉంటారు. అయితే అందులో ఎంత నిజం ఉందో అనే అనుమానంతో మెంతుల‌ను పూర్తిగా న‌మ్మ‌లేరు. అప్ప‌టికి మందులతో పాటు చాలా మంది మ‌ధుమేహులు మెంతుల‌ను కూడా నిత్యం సేవిస్తూ ఉంటారు. మెంతుల‌తో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు, ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా త‌గ్గుతున్నాయ‌ని అనేక ప‌రిశోధ‌న‌ల్లో సైతం వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ మెంతులకు ఔష‌ధ గుణ మందుల స్థాయిలో పోల్చేంత ఉందా.. ఉంటే ఏ స్థాయిలో ఉంది.. దీనిని ఎవ‌రెవ‌రూ వాడుకుంటే ప్ర‌యోజ‌నం ఉంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ధుమేహ నియంత్ర‌ణ కోసం చిర‌కాలంగా వాడుక‌లో ఉంది, సుర‌క్షిత‌మైన‌ది ఎంతో మంది వాడుకుంటున్న మందు మెట్ ఫార్మిన్. అధిక బ‌రువు, ఇన్సులిన్ నిరోధ‌క‌త వంటివి ఉన్న మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల్లో ఈ మందు ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇది క‌డుపులో ఆహారం జీర్ణంకావ‌డాన్ని నెమ్మ‌దింప‌జేస్తుంది. ఆక‌లి త‌గ్గించ‌డం, జీర్ణాశ‌యాన్ని ప్రేరేపించి ఆక‌లి త‌గ్గేలా ఇన్సులిన్ స్థాయిలు పెరిగేలా చేస్తుంది. నిజానికి 30 ఏళ్లుగా వాడుకంలో ఉన్నా కూడా మెట్ ఫార్మిన్ కు ఉన్న విసృత ప్ర‌యోజ‌నాలు ఇప్ప‌టికి బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. అందుకే దీన్ని మంచి మందుగా గుర్తించ‌డ‌మే కాదు ప‌రిశోధ‌కులు దీనిని మంచి కొల‌బ‌ద్ద‌గా కూడా తీసుకుంటున్నారు. మ‌ధుమేహ నియంత్ర‌ణ కోసం కొత్త కొత్త మందులు వ‌చ్చిన‌ప్పుడు వాటి ప‌నితీరును ఈ మెట్ ఫార్మిన్ తో పోల్చి విశ్లేషిస్తున్నారు. అందుకే మెంతుల సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేసేందుకు కూడా ప‌రిశోధకులు ఈ మెట్ ఫార్మిన్ నే కొల‌బ‌ద్ద‌గా ఎంచుకుని వాటిపై అధ్య‌య‌నం చేసారు.

Fenugreek Seeds For Diabetes will they work or not what experts say
Fenugreek Seeds For Diabetes

ఈ అధ్య‌య‌నంలో తేలిన విష‌యం ఏమిటంటే మెట్ ఫార్మిన్ రోజుకు 500 ఎమ్ జి వేసుకుంటున్న టైప్ 2 మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల్లో అలాగే ఈ మెంతుల పొడి రోజుకు మూడు పూట‌లా 5 గ్రాముల మోతాదులో తీసుకుంటున్న వారిలోనూ ఫ‌లితాలు ఒకేర‌కంగా ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో వారు మెంతుల‌ను మెట్ ఫార్మిన్ లా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఇత‌ర మందుల‌ను వాడ‌కుండా కేవ‌లం మెట్ ఫార్మిన్ తోనే షుగ‌ర్ వ్యాధిని నియంత్రించుకుంటున్న వారు ఈ మందుకు బ‌దులుగా మెంతుల‌ను కూడా వాడుకోవ‌చ్చ‌ని అర్థం అవుతుంది. రోజుకు 500 ఎమ్ జి మెట్ ఫార్మిన్ ను వేసుకుంటున్న వారు రోజూ 5 గ్రాముల మెంతి పొడిని మూడు పూట‌లా వాడుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అయితే ఈ మెంతుల‌ను వాడుకోవ‌డంలో కొన్నిప‌రిమితులు ఉన్నాయ‌ని వారు వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts