మీ కాలి బొటన వేళ్లను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. వాటి ద్వారా తెలుస్తుంది? ఏమీ తెలియడం లేదా..? మరోసారి చూడండి… చూశారా..? ఏముంది..? బొటన వేలిపై వెంట్రుకలు ఉన్నాయి కదా..? లేవా..? అయితే జాగ్రత్త..? ఎందుకంటే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేంటీ, కాలి బొటన వేలిపై ఉన్న వెంట్రుకలకు, గుండె జబ్బులకు సంబంధం ఏముంటుంది, అని అడగబోతున్నారా? కానీ సంబంధం ఉంది. అదేమిటో చూడండి…
ముందుగా వెంట్రుకలు ఎలా పెరుగుతాయో చూద్దాం. మన శరీరంలో ఏ ప్రదేశంలో ఉన్న వెంట్రుకలైనా వాటికి అందే పోషకాలను బట్టే పెరుగుతాయి. వెంట్రుకలు చర్మం లోపలి భాగంలో ముందుగా మొదలవుతాయి. అలా మొదలయ్యేందుకు రక్తం సహాయం తీసుకుంటాయి. మనం తినే ఆహారం ద్వారా రక్తంలో కలిసే పలు పోషకాలు వెంట్రుకల కుదుళ్లకు అందుతాయి. అక్కడ కొత్త కణాలు నిర్మాణమై వెంట్రుకలు ఏర్పడుతాయి. అలా కణాలు నిర్మాణమయ్యే కొద్దీ వెంట్రుకలు పెరుగుతూ పైకి వస్తుంటాయి. వెంట్రుకల పెరుగుదల ఇలా జరుగుతుంది.
అయితే మన శరీరంలోని అనేక భాగాల్లో పైన చెప్పిన విధంగా వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. వాటిలో కాలి బొటన వేలు కూడా ఒకటి. అక్కడ కూడా పైన చెప్పిన విధంగానే వెంట్రుకలు పెరుగుతాయి. కానీ కొందరిలో ఆ వెంట్రుకలు పెరగవు. ఎందుకంటే రక్తం నుంచి పోషకాలు సరిగా అందవు. అలా అందకపోవడానికి ప్రధాన కారణమేమిటంటే రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం ఏర్పడడమే. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారా మన శరీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది. అలా ఎక్కువ మొత్తంలో పేరుకుపోయే కొవ్వు ముందుగా చేరేది ధమనుల్లోనే. ఈ క్రమంలో ధమనుల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరా సరిగ్గా అవ్వదు. దీంతో పోషకాలు కూడా సరిగ్గా అందక వెంట్రుకలు పెరగవు.
ఇప్పుడు పైన చెప్పిన అసలు విషయంలోకి వద్దాం. కాలి బొటన వేలిపై వెంట్రుకలు పెరగకపోతే గుండె జబ్బులు వస్తాయని అన్నాం కదా. కాలి బొటన వేలినే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి. చేతులు, తలపై ఉన్న వెంట్రుకలను ఎందుకు లెక్కలోకి తీసుకోకూడదు. వాటిపై వెంట్రుకలు లేకున్నా గుండె జబ్బులు వస్తాయి కదా? అని మీరు అడగవచ్చు. కానీ కాలి బొటన వేలినే లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే తల, చేతులు గుండెకు చాలా దగ్గరగానే ఉంటాయి కాబట్టి గుండె నుంచి వచ్చే ప్రెషర్‌తో రక్తం ఎలాగో వాటికి అందుతుంది. అందుకే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదు. కానీ కాలు గుండెకు బాగా దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడి వరకు రక్తం సరఫరా కావాలంటే కొంత ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కాలి బొటన వేలిని లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది.
అయితే ఇక్కడే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటంటే కాలి బొటన వేలిపై ఉన్న వెంట్రుకలు బాగా పెరిగితే అక్కడ రక్త సరఫరా బాగున్నట్టే కదా. అంటే అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. అదే ఆ భాగంలో వెంట్రుకలు లేకపోతే వారికి రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం చేసుకోవాలి. దీంతో వారికి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి వారు వెల్లుల్లి రేకుల్ని నిత్యం తింటుంటే వారిలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే శక్తి వెల్లుల్లికి ఉంది. కాబట్టి మీ కాలి బొటన వేలును ఇప్పుడే ఒకసారి చూసుకోండి. ఏ మాత్రం తేడా అనిపించినా ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసేయండి. అన్నట్టు, పైన మేం చెప్పింది గాలి వాటంగా ఊహించి చెప్పింది కాదు, పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల సారాంశాన్నే పైన పేర్కొనడం జరిగిందని గమనించాలి.