Pregnancy Tips : సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే పౌష్టిక ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన సమయానికి మందులు ఉపయోగించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బిడ్డ కదలికలు ఎక్కువగా ఉండటమే కాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన మహిళలు కొందరు అధిక మోతాదులో సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు.
గర్భవతులు అధిక మొత్తంలో సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలపై పడుతుందని కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన సర్వేలో వెల్లడయింది.
గర్భం దాల్చిన మహిళలు సౌందర్య సాధన ఉత్పత్తులను వాడటం వల్ల వాటిలోని హానికర రసాయనాలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని నిపుణులు వెల్లడించారు. చాలా మంది పిల్లలు ఎదుగుదల లేకపోవడం, వారి పనులను వారు చేసుకోలేకపోవడం, అలాగే పిల్లలలో అధిక కదలికలు లేకపోవడం గుర్తించారు.
ఇలా పిల్లలు ఈ విధమైన సమస్యలతో బాధపడటం.. దానికి కారణం ఏంటని ఆరా తీయడంతో.. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారి తల్లులు సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగించడమే అని తేలింది. దాని వల్లే ఆ ప్రభావం పిల్లలపై పడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందువల్ల గర్భిణీలు కాస్మొటిక్స్ వాడకాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.