అధికంగా బరువు ఉండడం.. డయాబెటిస్, గుండె జబ్బులు రావడం.. అస్తవ్యస్తమైన జీవన విధానం కలిగి ఉండడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటాయి. ఎల్‌డీఎల్, ట్రై గ్లిజరైడ్లు ఎక్కువగా, హెచ్‌డీఎల్ తక్కువగా ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో టమాటాలు అద్బుతంగా పనిచేస్తాయి. రోజూ ఒక కప్పు టమాటా జ్యూస్‌ను ఉదయాన్నే తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొందరు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. రోజూ కొందరికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా 100 ఎంఎల్ మేర టమాటా జ్యూస్‌ను తాగమని ఇచ్చారు. అలా కొన్ని రోజులు చేసిన తరువాత వారి లిపిడ్ ప్రొఫైల్‌ను పరీక్షించారు. దీంతో వారిలో ఎల్‌డీఎల్, ట్రై గ్లిజరైడ్స్ బాగా తగ్గినట్లు గుర్తించారు. కనుక టమాటా జ్యూస్‌ను తాగితే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు.
ఇక ఈ పరిశోధనలను ఫిన్‌లాండ్‌కు చెందిన రీసెర్చ్ కౌన్సిల్ ఫర్ హెల్త్ ఆఫ్ ది అకాడమీ సైంటిస్టులు చేపట్టగా ఆ వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లోనూ ప్రచురించారు. టమాటాల్లో ఉండే లైకోపీన్ వల్లే ఎల్‌డీఎల్, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయని వారు తేల్చారు.
టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ ఎక్కువగా లభిస్తుంది కనుక రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. టమాటాల్లో ఉండే బీటా కెరోటీన్ కంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కనుక రోజూ టమాటా జ్యూస్ తాగితే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365