అరవై ఏళ్ళు దాటిన వారికి డయాబెటీస్, అధిక బరువు రెండూ చేరితే బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని స్వీడన్ లో చేసిన ఒక రీసెర్చి తెలుపుతోంది. రీసెర్చర్లు డయాబెటీస్ కు వాడే మందు కేన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తోందని కనిపెట్టారు. రక్తంలో తక్కువ కొవ్వు పదార్ధాలున్నవారికి ఈ రిస్క్ అధికంగా వుంటుందని కూడా వారు తెలిపారు. పరిశోధకులు డయాబెటీస్, అధిక బరువు రెండూ వున్న వ్యక్తులపై విస్తృత పరీక్షలు జరిపి ఈ రెండు రోగాలకు కేన్సర్ కు వున్న సంబంధాలను కనుగొన్నారు.
యౌవన దశలో డయాబెటీస్ వుండి, తర్వాత అధికబరువుకు లోనై అరవై ఏళ్ళ పైబడిన వారికి బ్రెస్ట్ కేన్సర్ రిస్కు వుందని మహిళలు తమకుగల ఈ రిస్కును గ్రహించి ముందుగానే జాగ్రత్తలు పడాలని సూచించారు. ప్రతి 100 మంది మహిళలలోను 15 మందికి బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్లు తెలిపారు.
అయితే, రక్తంలో అధికంగా కొవ్వు వున్న మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చేటందుకు 25 శాతం అధిక రిస్కు వున్నట్లుగా కూడా తెలిపారు. డయాబెటీస్ మందులైన గ్లార్ గైన్, మెట్ ఫార్మిన్ లలో గ్లార్ గైన్ మందుకు కేన్సర్ అధిక రిస్కని మెట్ ఫార్మన్ వలన 8 శాతం రిస్కు తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.