చేప ఆహారం తింటే డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని తాజాగా లండన్ లో చేసిన ఒక పరిశోధన వెల్లడించింది. స్పెయిన్ యూనివర్శిటీ లోని పరిశోధకులు చేప ఆహారం తింటే షుగర్ రోగులకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని తమ పరిశోధనలో వెల్లడించారు. డయాబెటీస్ కు చేప ఆహారానికి మధ్య గల సంబంధాలను వీరు నిరూపించారు.
కండరాలలోని కణాలలో ఒమేగా 3 ఆయిల్ అధికం చేస్తే అది డయాబెటీస్ ను తగ్గించే ఇన్సులిన్ సెన్సిటివిటీని అధికం చేస్తుందని గుర్తించారు. ఈ పరిశోధన 55 నుండి 80 సంవత్సరాల వయసు వున్న 945 మంది మహిళలు, పురుషులపై చేశారు. ఈ స్టడీ వాలెనిషియా మర్సిడస్ సోటోస్ ప్రీటో విశ్వవిద్యాలయ రీసెర్చర్లు డయాబెటీస్ అత్యధిక రిస్కు వున్న వారిపై చేశారు.
చేప ఆహారంలో గల ఒమేగా 3 నూనెలు డయాబెటీస్ పై అద్భుత ప్రభావాన్ని చూపిస్తున్నాయని, ప్రస్తుతం చేప ఆహారం అధికంగా తినే స్పెయిన్ దేశ ప్రజలు డయాబెటీస్ వ్యాధిని బాగా నియంత్రిస్తున్నారని స్పెయిన్ దేశపు వాలెన్షియా యూనివర్శిటీ వెల్లడించింది.