ఇండియన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం.. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే హైబీపీని తగ్గించేందుకు పుచ్చకాయ బాగా పనిచేస్తుంది. పుచ్చకాయలో ఉండే పోషకాలు బీపీని గణనీయంగా తగ్గిస్తాయి. అందువల్ల బీపీని తగ్గించుకోవాలని చూస్తున్న వారు పుచ్చకాయలను తినడం మంచిది.
పుచ్చకాయల్లో ఎల్-సిట్రులైన్, లైకోపీన్, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని అమాంతం తగ్గించేస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలను తినడం వల్ల హైబీపీ బాగా తగ్గుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఎల్-సిట్రులైన్, లైకోపీన్, పొటాషియంలు బీపీని బాగా తగ్గిస్తాయని వెల్లడైంది.
ఎల్-సిట్రులైన్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక గ్యాస్. ఇది రక్త నాళాలను సులభంగా సంకోచం, వ్యాకోచం చెందేలా చేస్తుంది. అంటే రక్త నాళాలు సులభంగా సాగుతాయి. దీని వల్ల బీపీ తగ్గుతుంది. పుచ్చకాయలను తినడం వల్ల సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీ తగ్గుతుంది.
పుచ్చకాయల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది ఉండడం వల్లే పుచ్చకాయలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్ ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది హైబీపీని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం పుచ్చకాయల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గించడంలో సహాయ పడుతుంది. అందువల్ల హైబీపీ ఉన్న వారు ఆహారంలో రోజూ పుచ్చకాయలను తీసుకోవడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.