Walking : వాకింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక శరీర బరువు ఉన్నవారు ప్రతి రోజూ ఒక అరగంట సమయం పాటు వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో అవయవాల పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, మన జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.
వాకింగ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే సాధారణ నడక కన్నా మరికొంత వేగంగా నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఇలా బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలోని కండరాల కదలికకు దోహదపడి మన శరీరంలోని అవయవాల పనితీరు మెరుగు పడి త్వరగా శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేపట్టిన పరిశోధనలో భాగంగా బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, ఇలాంటి వాకింగ్ చేసే వారు మరికొన్ని రోజులు ఎక్కువ కాలం బ్రతకవచ్చు అని పరిశోధనల్లో వెల్లడైంది.
బ్రిస్క్ వాకింగ్ చేసే వారిలో కండరాలు, ఎముకలు దృఢంగా మారడమే కాకుండా డయాబెటిస్ ముప్పు కూడా తగ్గుతుంది. ఈ క్రమంలోనే మన జీవితకాలం కూడా రెట్టింపు అవుతుందని నిపుణులు వెల్లడించారు.