మీకు ఆకలి బాగా వేస్తుందా ? షుగర్ లేకున్నా.. ఆకలి బాగా అవుతుందా ? ఏది కనబడితే అది లాగించేస్తున్నారా ? ఆకలిని తట్టుకోలేకపోతున్నారా ? అయితే అది కచ్చితంగా సమస్యే. దాంతో అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యకు వాల్‌నట్స్ చక్కని పరిష్కారం చూపుతాయి. వాల్‌నట్స్‌ను ఆకలి అయినప్పుడల్లా తింటే.. ఆకలి నియంత్రణలోకి రావడంతోపాటు అధిక బరువు కూడా తగ్గుతారు. దీంతో పోషకాలు కూడా అందుతాయి. ఈ మేరకు సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా ధ్రువీకరించారు కూడా.
డయాబెటిస్, ఒబెసిటీ అండ్ మెటబాలిజం అనే ఓ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నిత్యం వాల్‌నట్స్‌ను తినడం వల్ల మన మెదడులోని ఓ ప్రాంతం యాక్టివేట్ అవుతుంది. దీంతో ఆకలి అదుపులోకి వస్తుంది. రీసెర్చర్లు చెబుతున్న ప్రకారం.. మన జీర్ణాశయానికి, మెదడుకు నేరుగా సంబంధం ఉంటుంది. మనం ఆహారం తినడం ప్రారంభించాక.. జీర్ణాశయం నిండితే ఆ సిగ్నల్ మెదడుకు చేరుతుంది. దీంతో ఇక చాలు అనే సిగ్నల్‌ను మెదడు మనకు పంపుతుంది. అప్పుడు మనం తినడం ఆపేస్తాం. సరిగ్గా వాల్‌నట్స్‌ను తినడం వల్ల కూడా ఇలాగే జరుగుతుందట. కొద్దిగా వాల్‌నట్స్‌ను తింటే.. కడుపు నిండిన భావన కలుగుతుంది. మెదడు ఇక చాలు అనే సిగ్నల్‌ను పంపుతుంది. ఈ క్రమంలో ఎక్కువ సేపు మెదడు అలా పనిచేస్తూనే ఉంటుంది. దీంతో చాలా సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆకలి కంట్రోల్ అవుతుంది. ఇలా తీవ్రమైన ఆకలి సమస్య ఉన్నవారు దాన్నుంచి తేలిగ్గా బయట పడవచ్చు.
ఇక ఒకవేళ ఆకలి అయినా.. మళ్లీ వాల్‌నట్స్‌నే తినాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా ఆకలి మన అదుపులోకి వస్తుంది. దీంతోపాటు వాల్‌నట్స్‌ను తినడం వల్ల మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి అద్భుతమైన పోషకాలు అందుతాయి. దీంతో అధిక బరువు తగ్గడమే కాదు, గుండె ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. కనుక ఇకపై భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి బాగా అయితే.. జంక్ ఫుడ్ తినడానికి బదులుగా గుప్పెడు వాల్‌నట్స్‌ను తింటే.. ఆకలి అదుపులో ఉంటుంది. అలాగే మన శరీర ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365