Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌త్యేక ఆస‌క్తి

Eagle : గ‌ద్ద పునర్జన్మ గురించి ఈ రహస్యం మీకు తెలుసా ?

D by D
August 16, 2022
in ప్ర‌త్యేక ఆస‌క్తి, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Eagle : ప‌క్షుల్లో గ‌ద్ద‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌క్షి రాజుగా పేరు గాంచిన గ‌ద్ద జీవితం మిగితా ప‌క్షుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. గ‌ద్ద త‌న దృష్టికి ఉన్న శ‌క్తితో మేఘాలపై నుండి కూడా భూమిపై త‌న ల‌క్ష్యాన్ని చూడ‌గ‌ల‌దు. అంత‌టి శ‌క్తి గ‌ద్ద చూపుకు ఉంటుంది. వివిధ ర‌కాల ఆకారాల్లో చాలా చురుకుగా గ‌ద్ద ఆకాశంలో ఎగురుతుంది. గ‌ద్ద‌ గురించి మ‌నం చెప్పుకోవ‌ల‌సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం కూడా ఉంది. అదే గ‌ద్ద పున‌ర్జ‌న్మ‌. గ‌ద్ద‌కు పున‌ర్జ‌న్మ ఏంటి అని మ‌న‌లో చాలా మందికి సందేహం క‌లుగుతుంది. గ‌ద్ద పున‌ర్జ‌న్మ గురించి తెలుసుకోవాలంటే గ‌ద్ద జ‌న్మ ర‌హ‌స్యం గురించి తెలుసుకోవాల్సిందే.

గ‌ద్ద సుమారు 70 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జీవించ‌గ‌ల‌దు. గ‌ద్ద‌కు 30 నుండి 40 సంవ‌త్స‌రాల వ‌య‌సు రాగానే అది క్రమంగా బ‌ల‌హీన ప‌డ‌డం మొద‌ల‌వుతుంది. ఈ స‌మ‌యంలోనే గ‌ద్ద పంజాలు బ‌ల‌హీన ప‌డి వేటాడ‌డానికి స‌హ‌క‌రించ‌వు. ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవ‌డానికి ఇబ్బంది అవుతుంది. రెక్క‌లు బాగా పెరిగి స‌రిగ్గా ఎగ‌ర‌లేదు. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో గ‌ద్ద ముందు రెండే దారులు ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఇదే శ‌రీరంతో ఆహారం లేక మ‌ర‌ణించ‌డ‌మా.. లేక కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డ‌మా.. కానీ గ‌ద్ద మాత్రం రెండో దారిని ఎంచుకుని పున‌ర్జ‌న్మ ఎత్త‌డానికి సిద్ధ‌మ‌వుతుంది.

do you know about Eagle rebirth process
Eagle

క‌ఠోర శ్ర‌మ‌తో త‌న‌ను తాను మార్చుకోవ‌డానికి సిద్ద‌మైన గ‌ద్ద ఎత్తైన ప‌ర్వ‌తానికి చేరుకుంటుంది. అక్క‌డ తాత్కాలికంగా నివాసాన్ని ఏర్ప‌రుచుకుంటుంది. ముందుగా ఆహారం తీసుకోవ‌డానికి వీలు లేకుండా పెరిగిన త‌న ముక్కును బండ‌రాయికి పొడుచుకోవ‌డం ప్రారంభిస్తుంది. నొప్పి పెడుతున్న‌ప్ప‌టికీ పెరిగిన ముక్కును అర‌గ‌దీసుకుంటుంది. అలాగే గుబురుగా పెరిగి ఎగ‌ర‌డానికి స‌హ‌క‌రించ‌ని త‌న‌ రెక్క‌ల‌ను ఒక్కొక్క‌టిగా తానే తొల‌గించుకుంటుంది.

ఇక చివ‌ర‌గా త‌న పంజాల‌ను బండ‌రాయికి వేసి కొడుతూ విర‌గ్గొట్టుకుని కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఇలా 150 రోజుల పాటు శ్ర‌మించిన త‌రువాత గ‌ద్ద కొత్త రెక్క‌ల‌తో, కొత్త ముక్కుతో, కొత్త పంజాతో న‌వ య‌వ్వ‌నంగా నూత‌నోత్తేజంతో కొండ శిఖ‌రంపై ఎగురుతుంది. ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బ‌త‌కాల‌నే సంక‌ల్పంతో 5 నెల‌ల పాటు త‌న‌ను తాను కొత్త‌గా మార్చుకున్న గ‌ద్ద మిగ‌తా 30 సంవ‌త్స‌రాల పాటు హాయిగా జీవిస్తుంది.

Tags: Eagle
Previous Post

Saggubiyyam Semiya Payasam : పాయ‌సాన్ని ఇలా చేస్తే గ‌ట్టిప‌డ‌దు.. గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు..

Next Post

Prawns Pickle : 2 నెల‌ల పాటు నిల్వ ఉండే రొయ్య‌ల ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!