తెలుగు నెలలో ఎంతో పవిత్రమైన కార్తీకమాసం అంటేనే పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇలా ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసంలో కొందరు ఉపవాస దీక్షలతో శివకేశవులను ఆరాధిస్తారు. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఈ నియమాలను పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నదీస్నానమాచరించాలి. స్నానానంతరం ఈ నెలలో తులసి పూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు, కనుక తులసికి ప్రత్యేక పూజలు చేయాలి.
ప్రతిరోజూ ఉదయం కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా మన జీవితంలో మనం చేసిన సకల పాపాలు తొలగిపోతాయి. ఈ నెల మొత్తం ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆహార కొరత, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు.
అయితే కార్తీక మాసంలో పూజలు చేసే వారు నెల మొత్తం కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి.
ప్రతి సోమవారం పరమేశ్వరుడి ఆలయానికి వెళ్లి స్వామివారికి బిల్వపత్రాలను సమర్పించి నమస్కరించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతాడని పండితులు చెబుతున్నారు.