Greek Foot : సాధారణంగా మనలో కొందరికి శరీర అవయవాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. కొందరికి కొన్ని భాగాలు భిన్నమైన ఆకృతిలో ఉంటాయి. కొందరికి శరీరంలో ఒక వైపు భాగం పెద్దగా.. ఇంకో వైపు భాగం చిన్నగా ఉంటుంది. ఇవన్నీ మనకు పుట్టుకతోనే వస్తుంటాయి. అయితే ఇలాగే కొందరికి కాలి బొటన వేలి కన్నా రెండో వేలు పొడుగ్గా ఉంటుంది. ఇలా రెండు కాళ్లకూ బొటన వేళ్ల కన్నా వాటి పక్కనే ఉండే రెండో వేళ్లే పొడవుగా ఉంటాయి. ఇలా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటాయి. అయితే ఇలా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలి బొటన వేలి కన్నా రెండో వేలు పొడవుగా ఉంటే ఆ స్థితిని గ్రీక్ ఫుట్ అని అంటారట. ఇటువంటి పాదాలు ఉన్నవారికి త్వరగా కాళ్ల నొప్పులు వస్తాయట. ఎక్కువగా నడిస్తే అంతే సంగతులు. తీవ్రమైన కాళ్ల నొప్పులు ఏర్పడుతాయట. అలాగే ఎక్కువ పనిచేయకున్నా కాళ్లు త్వరగా అలసటకు గురవుతుంటాయట. ఇక వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కూడా ఉంటుందట.
కాలి బొటన వేలి కన్నా రెండో వేలు పొడవుగా ఉన్నవారు చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారట. జీవితాన్ని చాలా సులభంగా ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. వీరిలో క్రియేటివిటీ కూడా ఉంటుంది. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కొత్తవారిని కలవడం, పరిచయం చేసుకోవం అంటే వీరికి ఇష్టంగా ఉంటుంది. అలాగే వీరు ఇతరులను ఎల్లప్పుడూ మోటివేట్ చేస్తుంటారట. ఇతరుల్లో ప్రేరణను కలిగిస్తుంటారట. అయితే కోపం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందట. దీంతోపాటు ఇంట్లోని కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామిపై వీరి డామినేషన్ ఎక్కువగా ఉంటుందట. ఇలా అని చెప్పి గ్రీకులు విశ్వసిస్తారు. ఎంతో కాలం నుంచి వీరు దీన్ని నమ్ముతూ వస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా కొందరు ఇలాంటి వేళ్లు ఉన్నవారు బయట డామినేషన్ చేస్తూ మనకు కనిపిస్తుంటారు. దాని వెనుక ఉన్న అసలు కారణం ఇదన్నమాట..!